వీడియో: విచిత్రమైన ప్రవర్తనతో షాకిచ్చిన స్టార్ హీరో
స్టార్ హీరో విశాల్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `మకుటం` చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధిస్తోంది.
By: Sivaji Kontham | 31 Aug 2026 8:04 AM ISTస్టార్ హీరో విశాల్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `మకుటం` చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధిస్తోంది. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించి విశాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. అయితే సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఒక షూటింగ్ లొకేషన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో విశాల్ మానిటర్ ముందు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే సమయంలో నటిస్తూ.. దర్శకత్వం వహించడం వల్ల ఆయనపై ఉన్న ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. మానిటర్ ముందు విశాల్ తీవ్రమైన హావభావాలు ప్రదర్శిస్తూ.. విభిన్నంగా ప్రవర్తించిన విజువల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాల్‌కి ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అంటూ కొందరు ఆందోళన చెందగా... మరికొందరు మాత్రం ఆయనలో ఉన్న డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. నెక్స్ట్ సీన్‌కి సంబంధించిన డైరెక్షన్‌ను, నటీనటుల హావభావాలను మనసులో విజువలైజ్ చేసుకోవడం వల్లే అతడు అలా రియాక్ట్ అయ్యారని కొందరు సమర్థిస్తున్నారు.
ఏది ఏమైనా.. `మకుటం` చిత్రంలో విశాల్ నటనకు అతడి టేకింగ్‌కు మంచి మార్కులే వేసినా సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో అతడు విజయం సాధించారని టాక్ వినిపించింది. ఈ షూటింగ్ వీడియో వైరల్ అవ్వడం కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.
ప్రస్తుతం ఈ స్ట్రేంజ్ బిహేవియర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక డైరెక్టర్ విజన్‌ని, అతడి కష్టాన్ని ఈ విజువల్స్ ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు పేర్కొంటున్నారు. విశాల్‌లోని ఈ విభిన్నమైన యాంగిల్‌పై ప్రేక్షకులకు, అతడి ఫ్యాన్స్‌కు ఇప్పటికీ తీవ్రమైన ఆసక్తి నెలకొంది.
