కోలీవుడ్ హీరోకు డైరెక్టర్లతో ప్రాబ్లమ్.. అసలేమైందంటే?
అందుకే డైరెక్టర్, హీరో ఎప్పుడూ సింక్ లోనే ఉంటారు. వారికి సరిగ్గా సింక్ కుదిరితేనే వర్క్ తేలిక అవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Oct 2025 10:00 PM ISTఎప్పుడైనా ఇద్దరి మధ్య మంచి హెల్తీ బాండింగ్ ఉంటేనే రిలేషన్ బావుంటుంది. ఆ బాండింగ్ లేకుండా నువ్వా నేనా అన్నట్టు ఉంటే అందరి దృష్టిలో తక్కువ అవడం తప్ప మరేమీ ఉండదు. సినిమా విషయంలో కూడా అంతే. చిత్ర యూనిట్ లో అందరికీ మధ్య సఖ్యత ఉంటేనే మంచి సినిమాలొస్తాయి. కెమెరా మ్యాన్ నుంచి డైరెక్టర్, హీరో, నిర్మాత వరకు ప్రతీ ఒక్కరి విషయంలో ఆ హెల్తీ బాండింగ్ ఉండాలి.
హీరో- డైరెక్టర్ బాండింగ్ ముఖ్యం
అలా కాకుండా ఏ ఒక్క బాండింగ్ సరిగ్గా లేకపోయినా అక్కడి వాతావరణం మొత్తం దిబ్బ తింటుంది. క్రమంగా మంచి సినిమా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఈ కో ఆర్డినేషన్ హీరో, డైరెక్టర్ విషయంలో మరింత ముఖ్యం. సినిమా మొత్తాన్ని స్క్రీన్ పై ఉండి నడిపించడంలో హీరో కీలక పాత్ర పోషిస్తే, తెర వెనుక సినిమాను తీర్చిదిద్దడంలో డైరెక్టర్ కీలక పాత్ర పోషిస్తారు.
విశాల్, రవి అరసు మధ్య విబేధాలు
అందుకే డైరెక్టర్, హీరో ఎప్పుడూ సింక్ లోనే ఉంటారు. వారికి సరిగ్గా సింక్ కుదిరితేనే వర్క్ తేలిక అవుతుంది. అలా కాకుండా ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్స్ లు వచ్చాయంటే ఇక సినిమా సంగతి అంతే. ఇప్పుడు కోలీవుడ్ హీరో విశాల్, డైరెక్టర్ రవి అరసు మధ్య కూడా అలాంటి విబేధాలే వచ్చాయి. రవి అరసు దర్శకత్వంలో విశాల్ మగుడం అనే సినిమాను అనౌన్స్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
గతంలో మిస్కిన్ తో కూడా గొడవలు
కానీ డైరెక్టర్ తో వచ్చిన విబేధాల కారణంగా ఇప్పుడు ఆ సినిమాను పూర్తి చేయడానికి స్వయంగా విశాలే డైరెక్టర్ గా మారారు. విశాల్ కు డైరెక్టర్ తో విబేధాలు రావడం కొత్తేమీ కాదు. డిటెక్టివ్2 సినిమా టైమ్ లో డైరెక్టర్ మిస్కిన్ తో కూడా ఆయనకు సమస్య వచ్చింది. ఇద్దరి మధ్యా గొడవ ఎక్కువ అవడంతో డిటెక్టివ్2 తానే తీస్తానని విశాల్ అనౌన్స్ చేసి షూటింగ్ కంటిన్యూ కూడా చేశారు కానీ తర్వాత మళ్లీ దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు మళ్లీ రవి అరసుతో కూడా మిస్కిన్ తో లాగానే గొడవ జరిగింది. ఈ సినిమాకు కూడా తానే దర్శకత్వం వహించి సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి ఎవరి కథ వారు తీస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు రవి అరసు చేయాల్సిన మగుడం సినిమాకు విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఎంత బాగా తీసినా రవి అనుకున్నట్టు అయితే తీయలేరనేది వాస్తవం. కానీ విశాల్ మాత్రం మగుడం మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్న విశాల్ కు మగుడం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
