Begin typing your search above and press return to search.

విశాల్ 'మకుటం' టీజర్.. మొదటిసారి ఇలా..

సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. తాజాగా వచ్చిన టీజర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

By:  M Prashanth   |   12 Jun 2026 11:38 AM IST
విశాల్ మకుటం టీజర్.. మొదటిసారి ఇలా..
X

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కెరీర్‌ లో స్పెషల్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న చిత్రం మకుటం. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ విశాల్ మొదటిసారి బాధ్యతలు చేపట్టిన ఆ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న మకుటం మూవీ ఆ సంస్థకు 99వ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ కావడం మరో విశేషం. అయితే తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచింది.




సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. తాజాగా వచ్చిన టీజర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. మండుతున్న శవం దగ్గర ప్రశాంతంగా సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఇచ్చిన ఎంట్రీ టీజర్‌ కే హైలైట్‌ గా నిలిచింది. ఆ ఒక్క సీన్ తోనే సినిమాలో ఉండబోయే ఇంటెన్సిటీ, మాస్ ఎలిమెంట్స్‌ ను డైరెక్టర్ పరిచయం చేశారు.

మకుటం టీజర్‌ లో విశాల్ మూడు భిన్నమైన గెటప్స్‌ లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఓ పాత్రలో వయసు మళ్లిన గ్యాంగ్‌ స్టర్‌ గా, మరో రోల్ లో స్టైలిష్ లుక్‌ తో, ఇంకో పాత్రలో కామన్ పర్సన్ గా కనిపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కథ ఎలా సాగనుంది? అనే ప్రశ్నలను టీజర్ రేకెత్తిస్తోంది.

దర్శకుడిగా విశాల్ చూపించిన విజువల్ ప్రెజెంటేషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలను స్టైలిష్‌ గా తెరకెక్కించడంతో పాటు కథలోని అసలు మిస్టరీ బయటపెట్టకుండా ఇంట్రెస్ట్ ను కంటిన్యూ చేశారు. దీంతో దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నం విజయవంతంగా ఉండొచ్చనే అభిప్రాయం ఇప్పుడు సినీ ప్రియుల్లో వ్యక్తమవుతోంది.

ఇక నటి అంజలి పాత్ర కూడా టీజర్‌ లో ప్రత్యేకంగా నిలిచింది. నోట్లో కత్తి పెట్టుకుని ఫైట్‌ కు సిద్ధమవుతున్న షాట్‌ లో ఆమెను పవర్‌ ఫుల్ అవతార్ లో చూపించారు. ఇప్పటి వరకు కనిపించని మాస్ షేడ్‌ లో అంజలి కనిపించడం విశేషం. దుషార విజయన్ రోల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చూపించి కథలో ఆమెకు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

టెక్నికల్ గా కూడా మకుటం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ అందించిన విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ ను రిచ్‌ గా నిలబెట్టాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ కు మెయిన్ అసెట్ గా మారింది. యాక్షన్ సీన్స్ లో బీజీఎం ఇచ్చిన ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. ఎడిటర్ ఎన్.బి. శ్రీకాంత్ టీజర్‌ ను ఇంట్రెస్టింగ్ గా మలిచారు. జి. దురైరాజ్ రూపొందించిన ప్రొడక్షన్ డిజైన్ మూవీ వరల్డ్ ను మరింత గ్రాండ్‌ గా చూపించింది.

ఏదేమైనా మకుటం టీజర్ చూస్తే ఇది నార్మల్ యాక్షన్ సినిమా కాదనే ఫీలింగ్ కలుగుతోంది. విశాల్ ట్రిపుల్ రోల్, సెల్ఫ్ డైరెక్షన్, టెక్నికల్ టాలెంట్, ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ఆయన కెరీర్‌ లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలైలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై టీజర్‌ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.