Begin typing your search above and press return to search.

800 మందిని మ‌ట్టిక‌రిపించిన ఒకే ఒక్క‌డు!

ఈ క్ర‌మంలోనే విశాల్ కెప్టెన్ కుర్చీ ఎక్కాడు. స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు తెరకెక్కించ‌డం మొద‌లు పెట్టాడు.

By:  Srikanth Kontham   |   19 Nov 2025 6:00 PM IST
800 మందిని మ‌ట్టిక‌రిపించిన ఒకే ఒక్క‌డు!
X

విశాల్ పై యాక్ష‌న్ స‌న్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. స్టంట్ మాస్ట‌ర్లు విశాల్ క‌టౌట్ కు త‌గ్గ యాక్ష‌న్ సీక్వెన్స్ డిజైన్ చేస్తుంటారు. వాటిలో విశాల్ పెర్పార్మెన్స్ అంతే రియ‌లిస్టిక్ గా ఉంటుంది. విశాల్ పై యాక్ష‌న్ స‌న్నివేశాలు అంటే ఎలాంటి డూప్ లేకుండానే చేస్తుంటారు. రిస్క్ తీసుకోవ‌డంలో ఎంత మాత్రం ఆలోచించని నటుడు. యాక్ష‌న్ స్టార్ గా విశాల్ అందుకే అంత ప్ర‌త్యేకంగా నిలిచాడు. త‌మిళ స‌హా తెలుగు ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌ర చేసింది త‌న‌లో యాక్ష‌న్ కోణమే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా:

ప్ర‌స్తుతం యాక్ష‌న్ జాన‌ర్లో సినిమాలు త‌గ్గించి? వైవిథ్య‌మైన కంటెంట్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే విశాల్ కెప్టెన్ కుర్చీ ఎక్కాడు. స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు తెరకెక్కించ‌డం మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం విశాల్ హీరోగా న‌టిస్తూ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న చిత్రం `మ‌కుటం`. దుషార విజ‌య‌న్, అంజ‌లి హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక‌టి తెర‌కెక్కించారు. ఈ ఫైట్ సీన్ ఏకంగా 800 మంది ఫైట‌ర్ల మ‌ధ్య చిత్రీక‌రించారు.

యోధుడిలా పోరాటం:

ఈ స‌న్నివేశం ఒక్క‌టే 17 రోజుల పాటు చిత్రీక‌రించారు? అంటే సీన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్దం చేసుకోవ‌చ్చు. ఈ యాక్ష‌న్ స‌న్నివేశం సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సీన్ లో ప్ర‌త్యేక‌త ఏంటంటే? 800 మంది ఫైట‌ర్ల‌తో విశాల్ ఓ యోధుడిలా పోరాటం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంత వ‌ర‌కూ ఇలాంటి భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ విశాల్ ఎప్పుడూ చేయ‌లేదు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఎంతో వైవిథ్య‌త ప్ర‌య‌త్నించాడు. కానీ భారీ ఎత్తున ఫైట‌ర్ల మ‌ధ్య‌లో సీన్స్ చేయ‌లేదు. ఆ ర‌కంగా విశాల్ కిదే తొలి అనుభ‌వం. ఈ ఛాన్స్ తీసుకుంది విశాల్ అని తెలుస్తోంది. తానే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో? యాక్ష‌న్ స‌న్నివేశాన్ని మ‌రింత గొప్ప‌గా చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.

ద‌ర్శ‌కుడిగా విశాల్ ప్ర‌యాణం:

సాధారణంగా ఇలాంటి స‌న్నివేశాలు ఎక్కువ‌గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమాల్లో ఉంటాయి. వంద‌లాది..వేలాదిమంది మ‌ధ్య‌లో హీరోని ఒక్క‌డే నిల‌బెట్టి? యాక్ష‌న్ సీన్ చేయించ‌డం శంక‌ర్ ప్ర‌త్యేక‌త‌. ఈ విష‌యంలో ఇప్ప‌టికీ ఆయ‌నే టాప్. ఇప్పుడాయ‌న‌కు పోటీగా విశాల్ రెడీ అవుతున్నాడు. ద‌ర్శ‌కుడి విశాల్ ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. `డిటెక్టివ్ 2` చిత్రాన్ని కూడా విశాల్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగానికి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రెండ‌వ భాగానికి ఆయ‌న్ని త‌ప్పించి విశాల్ సీన్ లోకి వ‌చ్చాడు. విశాల్ ఈ ప్రాంచైజీ నిర్మాత కావ‌డంతో రైట్స్ ఆయ‌న వ‌ద్దే ఉన్నాయి. మ‌రి ద‌ర్శ‌కుడిగా విశాల్ జ‌ర్నీ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.