విశాల్ డైరెక్షన్.. ప్రేక్షకుల హాహాకారాలు
విశాల్ సినిమా అంటే రొటీన్ మాస్ అనే ముద్ర పడిపోయి ప్రేక్షకులు తన చిత్రాలకు ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఇలాంటి టైంలో విశాల్ అనవసర రిస్క్ చేశాడు.
By: Garuda Media | 15 Aug 2026 6:01 PM ISTతమిళంలో ‘చెల్లమే’ (తెలుగులో ప్రేమ చదరంగం) అనే డిఫరెంట్ మూవీతో హీరోగా పరిచయం అయిన విశాల్.. పెద్ద మాస్ హీరో అవుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఐతే సెండకోళి (పందెం కోడి)తో మాస్ ఇమేజ్ సంపాదించిన విశాల్.. ఆ తర్వాత మరిన్ని మాస్, యాక్షన్ మూవీస్ చేసి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. కానీ ఒక దశ దాటాక తన కెరీర్ డౌన్ అవడం మొదలైంది. గత ఐదారేళ్లలో ‘మార్క్ ఆంటోనీ’ మినహాయిస్తే తన ఖాతాలో హిట్ లేదు.
విశాల్ సినిమా అంటే రొటీన్ మాస్ అనే ముద్ర పడిపోయి ప్రేక్షకులు తన చిత్రాలకు ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఇలాంటి టైంలో విశాల్ అనవసర రిస్క్ చేశాడు. రవి అరసు అనే కొత్త దర్శకుడితో మొదలుపెట్టిన ‘మకుటం’ చిత్రాన్ని మధ్యలో తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎప్పట్నుంచో దర్శకత్వం చేయాలనుకుంటున్న విశాల్.. ఈ సినిమా ఔట్ పుట్ సరిగా రావట్లేదని, డెబ్యూ డైరెక్టర్ తడబడుతున్నాడని భావించి ‘మకుటం’ను టేకోవర్ చేశాడు.
ఐతే సినిమా బాగా ఆలస్యం కావడం, ప్రోమోలు అంత గొప్పగా లేకపోవడంతో నిన్న రిలీజైన ‘మకుటుం’కు బజ్ కనిపించలేదు. దీనికి తోడు సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇది పరమ రొటీన్ మాస్ సినిమా అని.. సినిమా అంతా క్రింజ్ సీన్లతో నింపేశాడని విశాల్ మీద విమర్శకులతో పాటు ప్రేక్షకులూ విరుచుకుపడుతున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎలా తీయకూడదో చెప్పడానికి ఈ సినిమా ఒక పాఠం లాంటిదనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తుండడం గమనార్హం. అసలే సినిమా పేలవం అంటే.. నిడివి ఏకంగా మూడు గంటలకు పైగా ఉండడంతో థియేటర్లలో ప్రేక్షకులు హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. మొత్తం విశాల్ కెరీర్లో అట్టడుగున నిలిచే చిత్రాల్లో ఒకటనే కామెంట్లు కూడా పడుతున్నాయి. అసలు కథలోనే లోపం ఉన్నపుడు,
విశాల్ ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని డైరెక్ట్ చేయడం తప్పు నిర్ణయమని.. దీని వల్ల దర్శకుడిగాా చాలా చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడని తన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు ఇటు తెలుగులోనే కాదు, అటు తమిళంలోనూ ఓపెనింగ్స్ లేవు. అసలే బ్యాడ్ టాక్, పైగా సూర్య సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పోటీ నెలకొనడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. లెెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరి చనిపోవడానికి ముందు మొదలుపెట్టిన చివరి చిత్రాల్లో ఇదొకటి. ఆయన సంస్థ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’కు ‘మకుటం’ భారీ నష్టాలే తెచ్చిపెట్టేలా ఉంది.
