Begin typing your search above and press return to search.

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

దర్శకుడు విశాల్ భరద్వాజ్, ఆర్యన్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు. తొలిసారి కలిసినప్పుడు షారుఖ్ కుమారుడనే కారణంతో అతడిలో గర్వం ఉంటుందని భావించానని, కానీ ఆర్యన్ సౌమ్యంగా, అహంకారం లేకుండా ఉంటాడని తెలిపారు. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్యన్‌కు కెమెరా వెనుక కథలు చెప్పే సహజమైన ప్రతిభ ఉందని కొనియాడారు.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 2:37 AM IST
షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!
X

వారసులు ఎంట్రీ ఇస్తున్న‌ప్పుడు వారిపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అడుగుపెట్టిన తర్వాత అతని పనితీరుపై అందరి దృష్టి పడింది. ఇత‌డు స‌క్సెస్ అవుతాడా? ఫెయిల‌వుతాడా? అన్న చాలా సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ వాట‌న్నింటి బ్రేక్ చేసి ఆర్య‌న్ ఖాన్ తొలి సినిమా `ది బ్యాడ్స్ ఆఫ్ బోయ్స్` తో స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆర్య‌న్ ఖాన్ గురించి రాసిన ప్రత్యేక వ్యాసం ఆసక్తి రేపుతోంది.

`తొలిసారి కలిసినప్పుడు షారుఖ్ కొడుకు కాబట్టి ఆర్యన్‌లో గర్వం ఉంటుందని అన్యాయంగా ఊహించుకున్నా. కానీ అతను అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. చాలా సౌమ్యంగా మ‌ర్యాద‌గా వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. అహంకారం లేకుండా సాధారణ యువకుడిలా మాట్లాడటం చూసి తన అభిప్రాయం మార్చుకున్నాన‌`న్నారు. దర్శకుడిగా ఆర్యన్ తెర‌క‌కెక్కించిన `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` సిరీస్ చూసిన తర్వాత మరింత ఆశ్చర్యం కలిగిందని విశాల్ పేర్కొన్నారు. తాను పెరిగిన ఇండస్ట్రీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో దగ్గరగా గమనించి వాటిపైనే సరదాగా నవ్వుకోగలిగే పరిణతి ఆర్యన్‌లో కనిపించిందని కొనియాడారు.

ఈ ధోరణిలో ఆర్య‌న్ ఆత్మవిశ్వాసం.. సున్నితత్వం స్పష్టంగా కనిపించాయ‌న్నారు. షారుఖ్ ఖాన్ నటుడిగా తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తుంటే? ఆర్యన్ మాత్రం తండ్రికి పూర్తి భిన్నమైన క్రియేటివ్ వాయిస్‌తో ముందుకు వస్తున్నార‌న్నారు. బాలీవుడ్ వినోద సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే దానికి నేటి తరానికి తగ్గ కొత్త రూపాన్ని ఇవ్వగల సత్తా ఆర్యన్‌కు ఉందని ప్రశంసించారు. కెమెరా వెనుక కథలు చెప్పడంలో ఆర్య‌న్ కి సహజమైన శైలి ఉందని అభిప్రాయపడ్డారు. దర్శకత్వంతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న ఆర్యన్ తొలి సిరీస్‌తోనే విమర్శకుల ప్రశంసలు..అవార్డులు అందుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

త‌దుప‌రి ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్ లో తీసే సినిమాపై ఇప్ప‌టికే చ‌ర్చ మొద‌లైంది. ఏ హీరోతో సినిమా చేస్తారు? ఎలాంటి క‌థ సిద్దం చేస్తున్నారు? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. డాడ్ షారుక్ ఖాన్ తో ఛాన్స్ తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. బిడ్డ‌లంటే షారుక్ ఖాన్ కి ఎంత ప్రేమ తెలిసిందే. ఇద్ద‌రిని న‌చ్చిన రంగంలో కి పంపించి కావాల్సినంత స్వేచ్ఛ క‌ల్పించారు. అవ‌స‌రం మేర తానే సొంతంగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారు. అంత ప్రేమ‌గ‌ల డాడ్ కుమారుడితో సినిమా చేయ‌లేరా? ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ `కింగ్` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.