Begin typing your search above and press return to search.

ఓవైపు ఏర్పాట్లు.. మరోవైపు సీక్రెసీ.. ఎందుకలా VIROSH?

టాలీవుడ్‌ లో మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్త.

By:  M Prashanth   |   2 Feb 2026 12:02 AM IST
ఓవైపు ఏర్పాట్లు.. మరోవైపు సీక్రెసీ.. ఎందుకలా VIROSH?
X

టాలీవుడ్‌ లో మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్త. గత కొద్దికాలంగా వీరిద్దరి రిలేషన్ పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పుర్‌ లో వారిద్దరూ వివాహ వేడుక జరగనుందంటూ నేషనల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

అదే సమయంలో అక్కడి ఓ హెరిటేజ్ ప్యాలెస్‌ లో విజయ్, రష్మిక (VIROSH) పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వైరల్ అవుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఆ జంట తమ పెళ్లిని అత్యంత గోప్యంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రముఖ ప్యాలెస్‌ ను బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నిశ్చితార్థంలాగే పెళ్లి వేడుక కూడా సైలెంట్‌ గా జరపాలన్నది వీరి ప్లాన్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే పెళ్లి అనంతరం హైదరాబాద్‌ లో సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌ లోని విజయ్ నివాసంలోనే వీరి నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.

కానీ ఆ విషయాన్ని విజయ్ గానీ, రష్మిక గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటికీ పెళ్లి వార్తలపై ఇద్దరూ మౌనం పాటించడం గమనార్హం. ఇటీవల ఎయిర్‌ పోర్టు లో ఆ విషయంపై ప్రశ్నించగా రష్మిక నవ్వుతూ స్పందించకుండా వెళ్లిపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఓ యువతి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది.

ఉదయ్‌ పుర్ ప్యాలెస్‌ లో డెకరేషన్ పనులు జరుగుతున్న విజువల్స్ తో పాటు విజయ్- రష్మిక పెళ్లి ఏర్పాట్లు అంటూ ఆమె పేర్కొనడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఆ వీడియోపై క్లారిటీ లేకపోవడంతో సినీ వర్గాలు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ వీడియోను ఫేక్ గా చూడాలని సూచిస్తున్నాయి. ఏదేమైనా విజయ్, రష్మిక మధ్య స్నేహం ఎప్పటినుంచో చర్చనీయాంశమే.

పబ్లిక్ ఈవెంట్స్‌ లో కలిసి కనిపించడం, ఒకే తరహా లొకేషన్లలో ఫోటోలు షేర్ చేయడం, కలిసి వెకేషన్లకు వెళ్లడం వంటి అంశాలు ప్రేమ ఉందనే ప్రచారానికి బలం చేకూర్చాయి. ఇటీవలే ఇటలీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకుని కలిసి హైదరాబాద్‌ కు రావడం కూడా ఆ ఊహాగానాలను మరింత బలపరిచింది. మొత్తానికి, ఓవైపు పెళ్లి ఏర్పాట్లపై వార్తలు.. మరోవైపు పూర్తి సీక్రెసీ.. దీంతో VIROSH అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి విజయ్, రష్మిక ఎప్పుడు రివీల్ చేస్తారో వేచి చూడాలి.