విరోష్ రిసెప్షన్: లగ్జరీ కార్లలో టాప్ -5 స్టార్ హీరోల ఇస్టయిల్
అల్ట్రా స్టైలిష్ లగ్జరీ కార్ల ఎంట్రీతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకలో సందడి చేసిన టాప్-5 స్టార్ హీరోల స్టైల్ , వారి ఖరీదైన కార్ల గురించిన వివరాల్లోకి వెళితే..
By: Sivaji Kontham | 5 March 2026 12:05 AM ISTహైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా వేదికగా జరిగిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న (#VIROSH) రిసెప్షన్ వేడుక ఆకాశంలో తారా లోకాన్ని తలపించింది. ఈ వేడుకకు విచ్చేసిన టాలీవుడ్ అగ్ర హీరోలు తమదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఆకట్టుకోవడమే కాకుండా.. అల్ట్రా స్టైలిష్ లగ్జరీ కార్ల ఎంట్రీతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకలో సందడి చేసిన టాప్-5 స్టార్ హీరోల స్టైల్ , వారి ఖరీదైన కార్ల గురించిన వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి-అక్కినేని నాగార్జున:
మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలాగే తన రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఒక డిజైనర్ నెహ్రూ సూట్‌లో మెరిసిపోయారు. ఆయన తన లగ్జరీ రోల్స్ రాయిస్ కారులో వేదిక వద్దకు చేరుకోగా అభిమానులు జేజేలు పలికారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన స్టైల్ ని కొనియాడారు. ఇక కింగ్ నాగార్జున తన ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ లుక్‌తో అదరగొట్టారు. ఆయన ఒక క్లాసీ బ్లేజర్ ధరించి తన ఖరీదైన రేంజ్ రోవర్ లో విచ్చేశారు. నాగార్జున స్టైల్ చూస్తుంటే వయస్సు పెరిగే కొద్దీ మరింత యంగ్‌గా కనిపిస్తున్నారని అతిథులు చర్చించుకున్నారు. నాగార్జునతో పాటు నాగచైతన్య, అమల కూడా వేడుకకు విచ్చేసారు.
విక్టరీ వెంకటేష్ - మాస్ మహారాజ్ రవితేజ:
విక్టరీ వెంకటేష్ తన సింప్లిసిటీని చాటుతూ ఒక ఫార్మల్ సూట్‌లో క్లాస్‌గా కనిపించారు. ఆయన తన ఫేవరెట్ టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ వ్యాన్‌లో ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ తనదైన ఎనర్జీతో సందడి చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సింగ్‌లో రవితేజ మాస్ లుక్‌లో అలరించగా, ఆయన తన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారులో దిగి వేదిక లోపలికి వెళ్లారు.
నేచురల్ స్టార్ నాని- అక్కినేని నాగచైతన్య:
నేచురల్ స్టార్ నాని తన `నేచురల్` ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక ఎంబ్రాయిడరీ కుర్తా ధరించి చాలా సింపుల్‌గా, హుందాగా కనిపించారు. ఆయన తన బీఎండబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ ఎస్‌యూవీలో విచ్చేశారు. ఇక యువ సామ్రాట్ నాగచైతన్య స్టైలిష్‌గా ఒక మోడ్రన్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. చైతన్య తన లగ్జరీ స్పోర్ట్స్ కార్ పోర్షే లో ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి నాగార్జునతో కలిసి చైతన్య కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇతర స్టార్ హీరోల సందడి:
వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. శ్రీకాంత్ ట్రెడిషనల్ కుర్తాలో కనిపించి అందరినీ పలకరించారు. అలాగే యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ , సిద్ధు జొన్నలగడ్డ కూడా విభిన్నమైన ట్రెండీ వేషధారణలో వేడుకకు విచ్చేశారు. శర్వానంద్ క్లాసిక్ బ్లేజర్‌లో రాగా, సిద్ధు జొన్నలగడ్డ తన డీజే టిల్లు మార్క్ స్వైగ్‌తో ఆకట్టుకున్నారు.
చిన్న హీరోలు- క్యారెక్టర్ ఆర్టిస్టులు:
కేవలం అగ్ర తారలే కాకుండా, విజయ్ దేవరకొండకు సన్నిహితులైన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వీరితో పాటు సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా హాజరై సందడిని పెంచారు. దాదాపు టాలీవుడ్‌లోని ప్రతి ఒక్క నటుడు ఈ వేడుకలో కనిపించడం విశేషం.
ఈ రిసెప్షన్ వేడుక కేవలం ఒక వివాహ వేడుకలా కాకుండా టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒకే చోట కలిసిన ఒక పెద్ద పండుగలా సాగింది. ఖరీదైన కార్లు.. అంతకంటే ఖరీదైన డిజైనర్ దుస్తులు.. సెలబ్రిటీల ఆత్మీయ పలకరింపులతో తాజ్ కృష్ణా ప్రాంగణం అంతా సరికొత్త వెలుగులతో నిండిపోయింది.
