Begin typing your search above and press return to search.

విరోష్ రిసెప్ష‌న్‌లో టాప్ -5 సెల‌బ్రిటీ జంట‌లు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్ బుధవారం సాయంత్రం తారల మెరుపులతో కళకళలాడింది. ఫిబ్రవరి

By:  Sivaji Kontham   |   5 March 2026 12:04 AM IST
విరోష్ రిసెప్ష‌న్‌లో టాప్ -5 సెల‌బ్రిటీ జంట‌లు
X

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా వేదికగా అత్యంత వైభవంగా జరిగిన #VIROSH (విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న) రిసెప్షన్ వేడుకకు విచ్చేసిన సెల‌బ్రిటీ జంట‌ల త‌ళుకుబెళుకులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్ బుధవారం సాయంత్రం తారల మెరుపులతో కళకళలాడింది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న (#VIROSH) జంట, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ దిగ్గజాల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌లోని స్టార్ జంటలు సందడి చేశాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమా దిగ్గజాలు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించడం ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన జంటలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన ఒకరు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్లాసీ లుక్‌లో మెరిసిపోగా.. ఉపాసన తనదైన శైలిలో ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో ఎంతో హుందాగా కనిపించారు. ఈ జంట వేదికపైకి రాగానే విజయ్ దేవరకొండ ఆత్మీయంగా కౌగిలించుకుని ఆహ్వానించారు. రామ్ చరణ్ .. విజయ్ మధ్య ఉన్న స్నేహబంధం ఈ సందర్భంగా మరోసారి కనిపించింది. ఉపాసన వేదిక పై రష్మికతో కాసేపు ముచ్చటించి ఆమెకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు నవ మన్మథుడు అక్కినేని నాగార్జున- అమల జంట ఈ రిసెప్షన్‌కు హాజరై సందడి చేశారు. నాగార్జున తన ఎవర్ గ్రీన్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా, అమల ఎంతో సింపుల్‌గా.. సంప్రదాయబద్ధంగా విచ్చేశారు. రష్మికతో నాగార్జున గతంలో `దేవదాస్` సినిమాలో నటించిన అనుబంధం ఉండటంతో.. వారి మధ్య ఆత్మీయ పలకరింపులు చోటుచేసుకున్నాయి. కొత్త జంటతో కలిసి ఈ అక్కినేని దంపతులు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని, ఆయన భార్య అంజన కూడా ఈ రిసెప్షన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, నాని మధ్య మంచి స్నేహబంధం ఉంది.. ముఖ్యంగా `ఎవడే సుబ్రమణ్యం` సినిమా నుండి వీరి పరిచయం బలపడింది. అందుకే తన మిత్రుడి వేడుకలో నాని సందడి చేశారు. వేడుక‌లో నాని ఎంతో సింపుల్‌గా, తన`నేచురల్ స్టైల్‌లో ఒక ఎంబ్రాయిడరీ కుర్తా ధరించి రాగా, అంజన ఎంతో అందమైన సంప్రదాయ చీరలో మెరిసిపోయారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య‌ నమ్రత శిరోద్కర్ త‌న కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేనితో క‌లిసి రావ‌డంతో వేడుకలో ప్రత్యేక సందడి క‌నిపించింది. నమ్రత చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ రష్మికను అభినందించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రాజకీయ రంగం నుండి ప్రముఖ నాయకులు.. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ కూడా ఈ శుభకార్యానికి విచ్చేశారు. విజయ్ దేవరకొండతో కేటీఆర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందే. కేటీఆర్ తన భార్యతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి వారితో కాసేపు సరదాగా గడిపారు. వీరి రాకతో రిసెప్షన్ వేదిక వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కేటీఆర్ దంపతుల రాక ఈ సినీ వేడుకకు ఒక రాజకీయ గాంభీర్యాన్ని జోడించింది.

మొత్తానికి ఈ స్టార్ క‌పుల్స్ రాకతో #VIROSH రిసెప్షన్ ఒక మెమరబుల్ ఈవెంట్‌గా నిలిచింది. తాజ్ కృష్ణాను అందంగా ముస్తాబు చేసిన తీరు, అతిథులకు వడ్డించిన విందు వంటకాలు.. ఈ సెలబ్రిటీల సందడి అంతా కలిసి హైదరాబాద్‌లో ఇది ఒక భారీ `పోస్ట్-వెడ్డింగ్ విందు`గా గుర్తింపు పొందింది. ఆత్మీయులు, ఆత్మీయ జంటల మధ్య విజయ్ - రష్మిక తమ కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా ప్రారంభించారు.