కొడగు పద్ధతిలో ఘనంగా రష్మిక - విజయ్ రిసెప్షన్.. ఎంత అందంగా ముస్తాబయ్యారో!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 7 April 2026 7:30 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ బంధాన్ని కొనసాగించారు. అయితే మీడియా ఎప్పటికప్పుడు ఈ జంటను కనిపెడుతున్నా.. వీరు మాత్రం అధికారికంగా తమ బంధాన్ని రివీల్ చేయలేదు. ఇక ఏదో ఒక రోజు వీరే స్వయంగా ప్రకటిస్తారని అభిమానులు వీరికి "విరోష్" అంటూ ముద్దుగా పేరు కూడా పెట్టేశారు.
వీరి పెళ్లి అధికారికంగా జరగబోతోందని వార్తలు వచ్చినా.. వీరు మాత్రం స్పందించలేదు. కానీ ఎట్టకేలకు ఫిబ్రవరి 22వ తేదీన అభిమానులు ప్రేమగా పెట్టిన విరోష్ అనే పదాన్ని స్వీకరిస్తూ "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక అన్నట్టుగానే 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్ లోని ఒక ప్యాలెస్ లో 100 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడగు సాంప్రదాయం ప్రకారం రెండు పద్ధతుల్లో చాలా ఘనంగా వివాహం జరుపుకున్నారు. అటు పెళ్లితోనే కాదు వేసుకున్న దుస్తులతో.. ధరించిన జ్యూవెలరీతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు తమ పెళ్లి వేడుకతో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఈ జంట.
ఇక వివాహం అనంతరం సినీ సెలబ్రిటీల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఇందులో చాలా అందంగా ముస్తాబయి అందర్నీ ఆకట్టుకున్నారు. రిసెప్షన్ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సందడి చేసిన విషయం తెలిసిందే
ఇకపోతే వివాహం అనంతరం హనీమూన్ కి వెళ్ళొచ్చిన ఈ జంట ప్రస్తుతం రణబాలి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే రష్మిక కొడగు సాంప్రదాయం ప్రకారం తమ బంధువుల కోసం మళ్లీ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు ఈ జంట. అసలు విషయంలోకి వెళ్తే.. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఇటీవల రష్మిక స్వస్థలమైన కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఈ జంట మరోసారి రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. రష్మిక సొంత గ్రామమైన కూర్గ్ లో కొడగు సాంప్రదాయంలో రిసెప్షన్ జరుపుకున్నారు. ఇకపోతే రష్మిక కొడగు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.
కూర్గి స్టైల్లో చీరను ధరించిన రష్మిక .. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక - విజయ్ దేవరకొండ జంట ఈ దుస్తుల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రెండవసారి రిసెప్షన్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.." నేను కొడగు రావడం ఇది మూడవసారి. మొదటిసారి రష్మికను కలవక ముందే నేను ఇక్కడికి వచ్చాను. గతంలో ఒకసారి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అయితే నా ఫ్రెండ్ ఈ రిసెప్షన్ కి హాజరు కాలేదు. నా స్కూల్ టైం లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాను. కొడగు అందాలు నాకు చాలా ఇష్టం . ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారు.అందుకే నేను కూర్గ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాను" అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. ఇక వీరిద్దరి రిసెప్షన్ కి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.
