Begin typing your search above and press return to search.

కోహ్లీ భాయ్‌ మళ్లీ తప్పు జరిగిందా?

ప్రతి రోజు ఎవరో ఒకరు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్‌కి గురి కావడం లేదంటే ఏదైనా వివాదం విషయంలో చర్చనీయాంశం కావడం పరిపాటిగా మారింది. తాజాగా కోహ్లీ గురించి చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   17 April 2026 11:00 AM IST
కోహ్లీ భాయ్‌ మళ్లీ తప్పు జరిగిందా?
X

సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్‌ అవుతోంది. వారు పొరపాటున లేదా అనుకోకుండా చిన్న విషయంలో నోరు జారిన, తప్పు చేసినా, మరేం చేసినా కూడా సోషల్‌ మీడియాలో వైరల్ కావడం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా జరుగుతున్న విషయం. సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా దాన్ని బూతద్దంలో పెట్టి మరీ చూసే వారు ఉన్నారు. ఇక స్టార్స్ ఎవరిని ఫాలో అవుతున్నారు, వారు చేసే పోస్ట్‌లు ఏంటి, వారు పెట్టే ఫోటోలు ఏంటా అంటూ ప్రతి రోజు లక్షల మంది చూస్తూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు చాలా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సమయంలో మిస్టేక్‌ జరిగి పోతూనే ఉంది. ప్రతి రోజు ఎవరో ఒకరు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్‌కి గురి కావడం లేదంటే ఏదైనా వివాదం విషయంలో చర్చనీయాంశం కావడం పరిపాటిగా మారింది. తాజాగా కోహ్లీ గురించి చర్చ జరుగుతోంది.

ఇన్‌స్టాలో విరాట్‌ కోహ్లీ ఫాలోయింగ్‌...

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ విరాట్ కోహ్లీకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో విరాట్‌ కోహ్లీ ముందు ఉంటాడు. అలాంటి విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆయన ఏ చిన్న ప్రాడెక్ట్‌ గురించి లేదా వ్యక్తిగతంగా ఎవరి గురించి అయినా పోస్ట్‌ చేస్తే వారు ఓవర్‌ నైట్‌ స్టార్‌ సెలబ్రిటీ కావడం మనం చూస్తూ ఉంటాం. గతంలో బాలీవుడ్‌ నటి అవ్‌నీత్ కౌర్‌ అలాగే ఓవర్‌ నైట్‌ ఫేమస్ అయింది. ఆమె ఫోటోకి విరాట్‌ కోహ్లీ లైక్ కొట్టాడు. దాంతో కోహ్లీ లైక్‌ కొట్టిన ఈమె ఎవరు, అసలు ఈమెకు ఎందుకు కోహ్లీ లైక్ కొట్టాడు అంటూ ఆమె గురించి సోషల్‌ మీడియాలో, గూగుల్‌ లో వెతకడం మొదలు పెట్టాడు. దాంతో ఆమెకు ఫుల్‌గా పాపులారిటీ దక్కింది.

అవ్‌నీత్‌ కౌర్ కి సోషల్‌ మీడియాలో....

కోహ్లీ లైక్‌తో అవ్‌నీత్‌ కౌర్‌ కి బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల నుంచి సినిమా ఆఫర్లు సైతం వచ్చాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. చివరకు ఆ లైక్‌ పొరపాటున వచ్చిందని, అసలు తాను ఆ ఫోటోలకు లైక్‌ చేయలేదు అంటూ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అల్‌గారిథమ్‌ తప్పిదం కారణంగా తాను లైక్ చేసినట్లుగా ఆమె ఫోటోలకు వచ్చిందని కోహ్లీ చెప్పాడు. అయినా కూడా ఆమె పేరు కొన్నాళ్ల పాటు మారుమ్రోగింది. కొందరు ఏకంగా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు పుట్టించారు. ఇప్పుడు మరోసారి కోహ్లీ లైక్ చర్చకు వచ్చింది. జర్మనీ ఇన్‌ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్ ఫోటో కి విరాట్‌ కోహ్లీ లైక్‌ కొట్టినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తోంది. దాంతో కోహ్లీ ఆమె ఫోటోకు లైక్ కొట్టడానికి కారణం ఏంటి అంటూ చాలా మంది తెగ వెతికేస్తున్నారు. దాంతో ఆమెకు ఒక్కసారిగా రీచ్ పెరిగి, ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

జర్మనీ ఇన్‌ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్...

విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఆయన తన యాడ్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీలకు సంబంధించిన వీడియోలు, తన వ్యక్తిగత విషయాలు ఇలా కొన్ని ముఖ్యమైన పోస్ట్‌లు మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇతరులను ఫాలో కావడం, ఇతరుల ఫోటోలకు లైక్ కొట్టడం, కామెంట్‌ పెట్టడం చేయడు. కానీ అప్పుడప్పుడు ఇలా చిన్న ఇన్‌ప్లుయెన్సర్‌ల పోస్ట్‌లకు ఆయన లైక్‌ కనిపించడంతో అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. మరి ఈ సారి కూడా కోహ్లీ లైక్‌ చేయకుండా తప్పు జరిగిందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కోహ్లీ స్పందించాల్సి ఉంది. ఆయన టీం మెంబర్స్ అయినా ఈ విషయం గురించి స్పందిస్తే బాగుంటుందని అంటున్నారు. కోహ్లీ భాయ్ మళ్లీ తప్పు జరిగిందా అంటూ పలువురు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మరి కోహ్లీ సమాధానం ఏంటో చూడాలి.