టాప్ -10లో మనోళ్లకు దక్కని చోటు
విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న ఇండియన్ సెలబ్రిటీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్. ఈయన హీరోగా సినిమాలు చేస్తున్నది తక్కువే అయినా, బ్రాండ్ వాల్యూ పరంగా ఆకాశంలో ఉన్నాడు.
By: Ramesh Palla | 26 Sept 2025 2:00 PM ISTఒకప్పుడు సినిమా స్టార్స్ కేవలం సినిమాల్లో మాత్రమే నటించే వారు, వారికి సినిమానే ఆదాయ మార్గం, ఇక క్రికెటర్స్ సైతం వారికి ఆట ఆడితే వచ్చే మ్యాచ్ ఫీజ్ మాత్రమే ఆధాయం. కానీ కాల క్రమేనా వీరి ఆదాయ మార్గాలు మారుతూ వచ్చాయి. సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ యొక్క స్టార్‌డం పెరిగినా కొద్ది బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. వారు చిన్న యాడ్‌లో నటించినా లక్షలు, కోట్ల రూపాయలు వసూళ్లు చేసే స్థాయికి పరిస్థితి మారింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను బట్టి కూడా వారి బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇండియాలోనే టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీగా నిలిచాడు. ఆయన బ్రాండ్ వాల్యూ ఏకంగా 231 మిలియన్‌ల యూఎస్ డాలర్లుగా ఉంది. ఈయన ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే కోట్ల రూపాయలను పారితోషికంగా పొందుతున్నాడు.
నెం.1 స్థానంలో విరాట్ కోహ్లీ..
విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న ఇండియన్ సెలబ్రిటీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్. ఈయన హీరోగా సినిమాలు చేస్తున్నది తక్కువే అయినా, బ్రాండ్ వాల్యూ పరంగా ఆకాశంలో ఉన్నాడు. బాలీవుడ్ స్టార్స్ కి అందనంత దూరంలో ఈయన బ్రాండ్ వాల్యూ ఉందని క్రోల్ సంస్థ పేర్కొంది. స్టార్స్, క్రికెటర్స్ యొక్క బ్రాండ్ వాల్యూను లెక్కిస్తూ ఈ సంస్థ ఒక జాబితా ను రెడీ చేసింది. అందులో మొత్తం 25 మంది ఇండియన్ స్టార్స్‌ను చేసింది. వారి బ్రాండ్ వాల్యూ ఏకంగా 2 బిలియన్ డాలర్లు ఉన్నట్లు క్రోల్ సంస్థ తన రిపోర్ట్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఏకంగా 8.6 శాతం ఈ బ్రాండ్ వాల్యూ పెరిగినట్లు సంస్థ తెలియజేసింది. ఇండియన్ సెలబ్రిటీలపై అంతర్జాతీయ స్థాయి కంపెనీలు సైతం భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న కారణంగా ఈ స్థాయిలో పెరిగినట్లు సంస్థ విశ్లేషించింది.
రణ్‌వీర్ సింగ్ కి క్రోల్ సర్వేలో రెండో స్థానం
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇప్పటికీ తన బ్రాండ్ వాల్యూను టాప్‌లో కొనసాగిస్తున్నాడు. ఈయన చేసే సినిమాలు తక్కువే, బ్రాండ్స్ తక్కువే అయినప్పటికీ ఈయన బ్రాండ్ వాల్యూ ఏకంగా 145.7 మిలియన్ డాలర్లుగా క్రోల్ సంస్థ పేర్కొంది. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన యొక్క స్టార్‌డం, ఆయన బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేసింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెం.1 గా ఉన్న విరాట్ కోహ్లీతో పోల్చితే షారుఖ్ ఖాన్ దాదాపు వంద మిలియన్ డాలర్ల వెనుక ఉన్నాడు. షారుఖ్ ఖాన్ తర్వాత స్థానంలో ఆలియా భట్ నిలిచింది. ఈమె బ్రాండ్ వాల్యూను 116.4 మిలియన్ డాలర్లుగా క్రోల్ సంస్థ లెక్కించింది. ఈమెకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ స్థాయిలో ఈమె బ్రాండ్ వాల్యూ ఉందనేది చాలా మంది అభిప్రాయం.
టాలీవుడ్ స్టార్స్‌కి దక్కని చోటు
ఆలియా భట్ నాల్గవ స్థానంలో ఉండగా, 112.2 మిలియన్ డాలర్లతో సచిన్ టెండూల్కర్ ఐదవ స్థానంలో, 108 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ ఆరో స్థానంలో, 102.9 మిలియన్ డాలర్లతో దీపికా పదుకునే ఏడో స్థానంలో, 102.8 మిలియన్ డాలర్లతో ధోనీ ఎనిమిదవ స్థానంలో, 92.2 మిలియన్ డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో, 83.7 మిలియన్ డాలర్లతో అమితాబ్ బచ్చన్ పదో స్థానంలో నిలిచారు. టాప్ 10 లో ఏడుగురు బాలీవుడ్‌కి చెందిన వారు కాగా, ముగ్గురు క్రికెట్‌కి చెందిన సెలబ్రిటీలు ఉండటం విశేషం. ఈ జాబితాలో సౌత్ స్టార్స్‌కి, ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్‌కి చోటు దక్కలేదు. వారి బ్రాండ్ వాల్యూ సౌత్ ఇండియాకే పరిమితం కావడంతో తక్కువ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ జాబితా వైరల్ అవుతోంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసే సౌత్ స్టార్స్ బ్రాండ్ వాల్యూ చాలా తక్కువ ఉండటం ఏంటో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
