Begin typing your search above and press return to search.

తెలుగులో నా ఫేవరెట్ హీరో అతనే : విరాట్ కోహ్లీ

క్రికెట్ లో విరాట్ కోహ్లీ.. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ క్రేడ్ మామూలుగా కాదు. ఈ ఇద్దరూ తమతమ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నారు

By:  M Prashanth   |   31 Aug 2025 8:45 AM IST
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతనే : విరాట్ కోహ్లీ
X

క్రికెట్ లో విరాట్ కోహ్లీ.. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ క్రేడ్ మామూలుగా కాదు. ఈ ఇద్దరూ తమతమ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నారు. క్రికెట్ లో విరాట్ రారాజుగా రాణిస్తుండగా, సినిమాల్లో తారక్ క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో తారక్ పై విరాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఎన్టీఆర్ పై విరాట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని, ఆయన సినిమాలు చూసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోనని కోహ్లీ అన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, తాను తరచుగా తెలుగు పాటలు వింటానని.. జూనియర్ ఎన్టీఆర్‌ తో సన్నిహిత బంధాన్ని పంచుకుంటానని కోహ్లీ వెల్లడించాడు. ఎన్టీఆర్ స్వభావాన్ని విరాట్ ప్రశంసించాడు. అతడి వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటన ఆద్భుతం అని, నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో సంతోషించినట్లు చెప్పాడు.

అయితే రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ సందర్భంగా వారి మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కనెక్ట్ అయ్యారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వ్యక్తి అయినప్పటికీ, కోలీవుడ్‌ లో తమిళ నటుడు శింబు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడని కోహ్లీ పేర్కొన్నాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మ్యూచుఫల్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్, తమ అభిమాన హీరో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఎన్టీఆర్- హృతిక్ రోషన్‌ కాంబోలో రీసెంట్ గా వార్ 2 సినిమా రిలీజైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనలాతో వచ్చి విఫలం అయ్యింది. ఇక విరాట్ కెరీర్ విషయానికొస్తే, కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో బరిలో దిగనున్నాడు.