చిన్న తప్పు.. రాజు వెడ్స్ రాంబాయి హీరో కెరియర్ ని పాడు చేసుకుంటున్నారా?
రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అఖిల్ రాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 30 Jun 2026 10:29 AM ISTరాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అఖిల్ రాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.మొదటి సినిమానే అయినా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒక సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకొని బంగారు భవిష్యత్తును ముందర పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న తప్పుతో కెరీర్ను పాడు చేసుకుంటున్నాడేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నటుడిగా సత్తా చాటాల్సిన అఖిల్ వివాదాలలో ఇరుక్కోవడం ఏంటి అనే రేంజ్ లో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఫుడ్ డెలివరీ బాయ్ పై అఖిల్ రాజ్ గొడవకు దిగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియో సారాంశం ప్రకారం సదరు డెలివరీ బాయ్ ఒక ఐటమ్ ను పొరపాటున రాంగ్ అడ్రస్ కు పార్సెల్ తీసుకొచ్చాడు. అయితే వెంటనే గమనించి క్షమాపణలు కూడా చెప్పాడట . కానీ హీరో అఖిల్ రాజ్ , ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బిల్డింగ్ మెట్ల పైనుంచి డెలివరీ బాయ్ వైపు వేగంగా దూసుకు వస్తూ అతడిని కొట్టడానికి ప్రయత్నించాడు. పైగా అఖిల్ ని ఆయన తండ్రి ఆపే ప్రయత్నం చేసినా.. అఖిల్ తన తండ్రిని పక్కకు నెట్టి మరీ ఆ డెలివరీ బాయ్ వైపు దూసుకు రావడం వీడియోలో చూడవచ్చు. ఇక ఈ దృశ్యాలను డెలివరీ బాయ్ స్వయంగా రికార్డు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాంగ్ అడ్రస్ కి డెలివరీ ఇచ్చాను.. తప్పని తెలుసుకొని క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో అఖిల్ నాపై దాడికి ప్రయత్నిస్తున్నారు. హీరో తల్లి కూడా నా ముఖంపై ఉమ్మి వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న డెలివరీ బాయ్స్ పై ఇలాంటి దాడులు తగవు అంటూ కామెంట్లు చేస్తున్నారు
ముఖ్యంగా సెలబ్రిటీ అయి ఉండి కూడా సామాన్య ప్రజలపై ఇంత ప్రతాపం ఎందుకు? తప్పని తెలుసుకొని క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ రేంజ్ లో విరుచుకుపడడం తగదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం ఒకవైపు వీడియో మాత్రమే బయటకు వచ్చింది. మరొకవైపు ఏం జరిగింది అనే విషయం తెలియదు కదా.. పూర్తి వివరాలు తెలిస్తేనే ఒకరిని నిందించాలి అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ బంగారు భవిష్యత్తు ఉన్న అఖిల్ ఈ చిన్న తప్పు చేసి తన కెరియర్ను పాడు చేసుకుంటున్నాడు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా అఖిల్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
