ఈ ఫోటోలో ఆలియా భట్ ఎక్కడుందో గుర్తు పట్టగలరా?
బాలీవుడ్ పాపులర్ హీరో సారథ్యంలోని ఒక చారిటీ ఈవెంట్‌లో దిగిన పాత ఐకానిక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
By: Sivaji Kontham | 5 July 2026 7:49 AM ISTబాలీవుడ్ పాపులర్ హీరో సారథ్యంలోని ఒక చారిటీ ఈవెంట్‌లో దిగిన పాత ఐకానిక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ పక్కన పరిశ్రమలోని టాప్ హీరోయిన్లందరూ ఒకే వేదికపై నిలిచిన ఈ అరుదైన చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఒకటి ఉంది. ఈ ఫోటోలో సల్మాన్ ఖాన్ పక్కన నల్లటి గళ్ళ చొక్కా, కళ్లజోడు ధరించి ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో కనిపెట్టగలరా? ఇప్పటి టాప్ హీరోయిన్.. ఒక్కో సినిమాకి 15కోట్లు అందుకుంటోంది. నాటి వేడుకలో ఒక సాధారణ కిడ్‌లా కనిపించిన ఈ చిన్నారి నేడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తీరుపై సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోలిక - చర్చ మొదలైంది.
ముఖ్యంగా రెడ్డిట్ వేదికగా అలియా భట్‌తో పోలిస్తే సీనియర్ నటి రాణి ముఖర్జీ తన తక్కువ ఎత్తును ప్రేక్షకులు గుర్తించకుండా... దాని గురించి ఎక్కడా చర్చకు రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగింది? అనేదానిపై నెటిజన్లు పలు ఆసక్తికరమైన కారణాలను విశ్లేషించారు. ఈ చర్చలో రాణి ముఖర్జీకి ఉన్న అద్భుతమైన నటన- స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన కారణమని నెటిజన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాణి ముఖర్జీ తన తరంలోనే అత్యుత్తమ నటిగా నిలిచారని.. తెరపై కనిపించినప్పుడు రాణీ నటన.. పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ.. కెమెరాను హోల్డ్ చేసే సామర్థ్యం వల్ల ప్రేక్షకులు తన ఎత్తును అస్సలు గమనించలేదని మర్దానీ, బ్లాక్ వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
దీనికి తోడు రాణి ముఖర్జీకి ఉన్న ఆకర్షణీయమైన రూపం తనకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆలియా భట్ ఎంత పెద్ద స్టార్ అయినా తన రూపం చాలా వరకు ఒక చిన్న పిల్లలా కనిపిస్తుందని.. కానీ రాణి ముఖర్జీకి ఒక రకమైన మెచ్యూర్డ్ లుక్, సెన్సువల్ ఆరా.. ఆకర్షణీయమైన శారీరక సౌష్టవం ఉండటం వల్ల తను ఎల్లప్పుడూ స్క్రీన్‌పై ఒక పరిపూర్ణమైన స్త్రీగా రాణించిందని నెటిజన్లు విశ్లేషించారు. ఈ శారీరక ఆకర్షణ- హావభావాలు రాణీ ఎత్తు తక్కువ అనే విషయాన్ని పూర్తిగా మరుగున పడేశాయని చర్చించారు.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే..రాణి ముఖర్జీకి ఉన్న అపారమైన ఆత్మవిశ్వాసం, నిజాన్ని అంగీకారించే స్వభావం. రాణి ముఖర్జీ తన రూపాన్ని, ఎత్తును పూర్తిగా అంగీకరించి చాలా కాన్ఫిడెంట్‌గా కెరీర్‌ను నిర్మించుకుందని నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత వైరల్ ఫోటోలోనే సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా వంటి ఎత్తైన హీరోయిన్ల పక్కన నిలబడినప్పుడు కూడా రాణీజీ ఎక్కడా అభద్రతాభావానికి లోనవ్వకుండా చాలా హుందాగా వ్యవహరించిందని కొనియాడారు. దీనికి తోడు తనకు ఉన్న అందమైన హాజెల్ కళ్ళు, ప్రత్యేకమైన హస్కీ వాయిస్ ఆమెకు ఒక విలక్షణమైన గుర్తింపును ఇచ్చాయని.. రాణీ కళ్లతోనే హావభావాలను అద్భుతంగా పలికిస్తుందని చర్చించారు.
చివరగా.. పాత్రల ఎంపిక- సహజమైన గుర్తింపు విషయంలో కూడా రాణి ముఖర్జీ శైలి భిన్నమైనదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రాణి ముఖర్జీ తనకు సరిపోయే బలమైన, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుందని.. ఎలాంటి ప్రచార స్టంట్లు, ఫేక్ ప్రమోషన్లు లేకుండా కేవలం తన నటన ద్వారానే ఆర్గానిక్‌గా పాపులారిటీ తెచ్చుకుందని తెలిపారు. దీనికి భిన్నంగా ఆలియా భట్ తనను తాను `లేడీ బచ్చన్` అని, `మెరిల్ స్ట్రీప్` అని ఓవర్‌గా ప్రమోట్ చేసుకోవడం వల్లే నెటిజన్లు తనను పక్కన పెట్టి ఎత్తు లేదా రూపంపై ఎక్కువగా నెగెటివ్ విమర్శలు చేస్తున్నారంటూ రెడ్డిట్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
