ది రాజా సాబ్: ఓవర్సీస్ లో అసలు రచ్చకు కారణమిదే
ప్రభాస్ అంటేనే భారీ కటౌట్, చేతిలో పెద్ద కత్తి, యుద్ధం.. గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి. '
By: M Prashanth | 21 Nov 2025 4:00 AM ISTప్రభాస్ అంటేనే భారీ కటౌట్, చేతిలో పెద్ద కత్తి, యుద్ధం.. గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి. 'బాహుబలి' నుంచి మొన్నటి 'కల్కి' వరకు ప్రభాస్ ను ఒక సీరియస్ వారియర్ గానే చూస్తున్నాం. కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంది. మా పాత 'డార్లింగ్' ఎప్పుడు వస్తాడు? 'బుజ్జిగాడు' లాంటి ఈజ్, ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తాం? అని వారు ఎదురుచూడని రోజు లేదు. సరిగ్గా ఆ కోరిక తీర్చడానికే 'ది రాజా సాబ్' వస్తున్నాడు.
నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇది వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ సినిమానే, యుద్ధం లేదు. కేవలం మారుతి మార్క్ హారర్ కామెడీ. గ్రాఫిక్స్ లోన్ భయపెడుతూ నవ్వించనున్నారు. అయినా సరే, 2026న జనవరి 8 ప్రీమియర్స్ ఉంటే, నెల రోజుల ముందే (డిసెంబర్ 4న) టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి సినిమాకో, లేదా భారీ యాక్షన్ సినిమాకో ఇలాంటి హడావిడి ఉంటుంది. కానీ ఒక ఫన్ ఎంటర్టైనర్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ప్రభాస్ స్టార్ డమ్ కి నిదర్శనం. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ ని సీరియస్ రోల్స్ లో చూసి చూసి ఆడియన్స్ కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈసారి ఆయన్ని ఒక ఫన్, ఈజీ గోయింగ్ రోల్ లో చూడాలని డిసైడ్ అయ్యారు.
మారుతికి కామెడీ టైమింగ్, హీరోల బాడీ లాంగ్వేజ్ ని స్టైలిష్ గా చూపించడంలో మంచి పట్టుంది. ఈ కాంబినేషన్ లో 'వింటేజ్ ప్రభాస్' బయటకు వస్తాడనే నమ్మకమే ఇప్పుడు ఓవర్సీస్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే 'స్పిరిట్' సినిమా పనులు డిసెంబర్ లో మొదలవుతున్నాయి. లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. అది ఎలాగూ వయొలెన్స్ తో కూడిన సీరియస్ సినిమా. కాబట్టి ఆ రక్తపాతం చూసేలోపు, ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చేలాగా 'రాజా సాబ్' ఉపయోగపడనుంది. ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ లో ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ స్టెప్.
నార్త్ అమెరికాలో మొదలైన ఈ హంగామా చూస్తుంటే, 'రాజా సాబ్' బాక్సాఫీస్ దగ్గర నవ్వుల జాతర చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి 2 రికార్డులను (22 మిలియన్ డాలర్లు) టచ్ చేయాలంటే కత్తులే అవసరం లేదు, డార్లింగ్ నవ్వితే చాలు అని ఈ సినిమా నిరూపించేలా ఉంది. చూడాలి మరి ఓపెనింగ్స్ రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో.
