Begin typing your search above and press return to search.

స్టార్ విల‌న్ భార్య‌కు విడాకులివ్వ‌డానికి కార‌ణం?

సూప‌ర్ స్టార్ల సినిమాల్లో విల‌న్ గా న‌టించిన త‌మిళ న‌టుడు వినాయ‌క‌న్ వివాదాస్ప‌ద జీవితం గురించి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   30 Aug 2026 2:00 PM IST
స్టార్ విల‌న్ భార్య‌కు విడాకులివ్వ‌డానికి కార‌ణం?
X

సూప‌ర్ స్టార్ల సినిమాల్లో విల‌న్ గా న‌టించిన త‌మిళ న‌టుడు వినాయ‌క‌న్ వివాదాస్ప‌ద జీవితం గురించి తెలిసిందే. తాగి ప‌బ్లిక్ లో న్యూసెన్స్ చేయ‌డం ద్వారా అత‌డు పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లిన విజువ‌ల్స్ ఆడియెన్ కి బాగా తెలుసు. అత‌డు ఇటివల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం - విడాకులకు సంబంధించిన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మాస్ విల‌న్ బయట తన ప్రైవేట్ జీవితాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వివాహ బంధం ముగియడానికి గల అసలు కారణాలను బయటపెట్టారు.

తమ విడాకుల వెనుక ఎలాంటి పెద్ద గొడవలు లేదా విభేదాలు లేవని వినాయకన్ స్పష్టం చేశారు. ఇద్దరం కలిసి జీవించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు..కానీ మేము కలిసి ఉండలేకపోయాం... అందుకే విడిపోయాం అని ఆయన తెలిపారు. విడిపోయినా.. ఇప్పటికీ తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. తన మాజీ భార్య ఇప్పటికీ తన కొన్ని పనులను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ విడాకులకు తానె బాధ్యుడనని.. తన ప్రవర్తనే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని వినాయకన్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ఆమెకు ప్రశాంతతనివ్వడం నా వల్ల కాలేదు...అందుకే త‌న‌ను తనకు ఇష్టమైన రీతిలో జీవించనివ్వడమే మంచిదని భావించాను.. అని ఆయన వెల్లడించారు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమెకు మరింత పెద్ద సమస్యగా మారుతుందని భావించి విడిపోయామని తెలిపారు.

తన వ్యక్తిత్వం .. నటుడిగా వచ్చిన ఇమేజ్ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాయని వినాయకన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ తనను కేవలం ఒక నటుడిగానే చూస్తున్నారని.. చివరికి ఇంట్లో కూడా తనకు ఒక సాధారణ మనిషిగా జీవించే అవకాశం దక్కడం లేదని అన్నారు. తన మనసులోని భావాలను స్వేచ్ఛగా పంచుకోగలిగే కొద్దిమందిలో తన మాజీ భార్య ఒకరని... అటువంటి భావోద్వేగ అనుబంధాన్ని కోల్పోవడం తన జీవితంలో అత్యంత కష్టమైన దశ అని ఆయన పేర్కొన్నారు.

సినిమాల విషయానికి వస్తే.. మలయాళంతో పాటు సౌత్ ఇండియాలోనే వినాయకన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన `జైలర్` చిత్రంలో వర్మన్ అనే విలన్ పాత్రలో ఆయన చూపించిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, `జైలర్ 2` చిత్రంలో కూడా తన నటనతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.