Begin typing your search above and press return to search.

శ్ర‌మ‌ను దోచుకున్నా? అదే క‌ష్టంతో!

బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే ప్ర‌యాణం ఎంతో స్పూర్తిదాయ‌క‌మైంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి న‌టుడు.

By:  Srikanth Kontham   |   27 Jan 2026 4:00 AM IST
శ్ర‌మ‌ను దోచుకున్నా? అదే క‌ష్టంతో!
X

బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే ప్ర‌యాణం ఎంతో స్పూర్తిదాయ‌క‌మైంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి న‌టుడు. టీవీ సీరియ‌ల్స్ నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డుతోనే ఉత్త‌మ న‌టుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. 15 ఏళ్ల పాటు ప‌డిన క‌ష్టానికి ఇప్పుడు ప్ర‌తి ఫ‌లం పొందుతున్నాడు. `12 త్ ఫెయిల్` సినిమా విక్ర‌మ్ సినీ జీవితాన్నే మార్చేసింది. ఒక్క విజ‌యం...జాతీయ అవార్డు అత‌డి గ‌మ‌నాన్నే మార్చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ వాటెండ్ స్టార్ గా మారిపోయాడు.

అయితే ఈ స‌క్సెస్ అంత ఈజీగా రాలేదు. రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. ఎన్నో నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డిపాడు. చేయ‌ని ప‌ని అంటూ లేదు. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..16 ఏళ్లకే బాధ్యతలు - రోజుకు 16 గంటల పనిచేసాడు. విక్రాంత్ చాలా సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కేవలం 16 ఏళ్ల వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. కాఫీ షాప్‌లో బారిస్టాగా ప‌నిచేసాడు. త‌న కాలేజ్ ఫీజ్ తానే సంపాదించుకుని క‌ట్టుకున్నాడు . నాలుగు లోకల్ ట్రైన్లు మారి ప్ర‌యాణం చేసేవాడు. ఆక‌లి వేస్తే? కేవలం పార్లే-జీ బిస్కెట్లు, నీళ్లతోనే స‌రిపెట్టుకునేవాడు. ఆ బిస్కెట్ ప్యాకెట్లు రోజులు ఎన్నో చూసాడు.

ఒక్కోసారి కేవ‌లం నీళ్ల‌తోనే క‌డుపు నింపుకున్న రోజులున్నాయి. ఓ హోటల్‌లో పని చేస్తున్నప్పుడు విక్ర‌మ్ రూపాన్ని చూసి ఓ టీవీ నిర్మాత ఆడిషన్ ఇవ్వమని కోరాడు. అలా విక్రాంత్ కెరీర్ మొదలైంది. షూటింగ్ మొదటి రోజే డైరెక్టర్ అందరి ముందు తిట్టడంతో విక్రాంత్ ఏడ్చేశాడు. అయినా వెనక్కి త‌గ్గ‌లేదు. క‌న్నీళ్లు, క‌ష్టాలు శాశ్వ‌తం కాద‌నుకున్నాడు. శ్ర‌మ దోపిడికి గుర‌య్యాడు. ప‌నిచేస్తే స‌గం డ‌బ్బులు ఇవ్వ‌డం...మిగ‌తా స‌గం డ‌బ్బులు మ‌ధ్య‌వ‌ర్తులు తినేయ‌డంతో? అందిన దానితోనే స‌ర్దుకునేవాడు. ప్ర‌త్యేకించి ఈ ర‌క‌మైన దోపిడీకి టీవీ ఇండ‌స్ట్రీలోనే గుర‌య్యాడు.

ఓ రోజు త‌న క‌ష్టాను గుర్తించే ఓ నిర్మాత అవ‌కాశం ఇవ్వ‌డంతో జీవితంలో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. టీవీలో స్టార్‌గా ఉన్నప్పుడే, సినిమాల్లో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఆ రంగాన్ని వదిలేశాడు. నువ్వు టీవీ నటుడివి. సినిమాలకు పనికిరావు అని రిజెక్ట్ చేసారు. అవ‌మానానికి గురి చేసారు. 2013లో రణవీర్ సింగ్ న‌టించిన `లూటేరా`లో చిన్న పాత్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.`దిల్ ధడక్నే దో`, `హాఫ్ గర్ల్‌ఫ్రెండ్` వంటి సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూనే నటనతో మెప్పించాడు. ఓటీటీ సిరీస్ `మీర్జాపూర్` లో బబ్లు పండిట్ పాత్రతో విక్రాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అటుపై `క్రిమినల్ జస్టిస్`, `బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్` వంటి సిరీస్‌లతో ఓటీటీ స్టార్‌గా ఎదిగాడు.