అవార్డులొచ్చినా తాను మాత్రం మారడు!
ప్రేక్షకులకు చేరువయ్యేలా యధావిధిగా తన ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయన్నాడు. అవార్డుల పేరుతో మరీ ఎక్కువగా ఒత్తిడికి గురికానని..అన్ని రకాల పరిస్థితులను బ్యాలెన్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపాడు.
By: Srikanth Kontham | 26 Sept 2025 3:00 PM ISTజాతీయ..అంతార్జాతీయ అవార్డులు అందుకున్న వేళ నటులలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తుంటాయి. నటులుగా భాద్యత పెరుగుతుంది. ఈ క్రమంలో తదుపరి చేసే సినిమాల విషయంలో మార్పులు తీసుకురావాలని కోరు కుంటారు. మరింత బాద్యతగా పని చేయాలనుకుంటారు. సమాజాన్ని ప్రేరేపించేలా తమ సినిమా కంటెంట్ ఉండాలని ఆశిస్తుంటారు. తదుపరి ప్రయాణంలో ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతుంటారు. అన్నింటిని మించి కథల విషయంలో విమర్శలకు గురి కాకుండా ఉండాలని చూసుకుంటారు.
అయితే బాలీవుడ్ యువ నటుడు విక్రాంత్ మాస్సే మాత్రం ఎలాంటి అవార్డులు అందుకున్నా? కథల విషయంలో తన తీరు మాత్రం మారదంటున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాసే కూడా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి తన ప్రయాణాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పురస్కారంతో ప్రయాణం మరింత సవాల్ గా మారుతుందన్నాడు. `అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకటి మాత్రంకచ్చితంగా చెప్పగలను. ఎలాంటి అవార్డులు అందుకున్నా తన కథల ఎంపికలో ఎలాంటి మార్పు మాత్రం ఉండద`న్నాడు.
ప్రేక్షకులకు చేరువయ్యేలా యధావిధిగా తన ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయన్నాడు. అవార్డుల పేరుతో మరీ ఎక్కువగా ఒత్తిడికి గురికానని..అన్ని రకాల పరిస్థితులను బ్యాలెన్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపాడు. జీవీతంలో సంతోషం ఎలా వస్తుందా? దుఖం కూడా అలాగే వస్తుందని...ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసిన సందర్భాలు ఎన్నో అన్నాడు. తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో ఎన్నో విషయాలు తెలుసు కున్నానన్నాడు. `లూటేరా` చిత్రంతో విక్రాంత్ మాసే బాలీవుడ్ ప్రయాణం మొదలైంది.
అటుపై `దిల్ దడకన్ దో`, `ఏ డెత్ ఇన్ ది గంజ్`, `చపాక్` లాంటి ఎన్నో సినిమాలు చేసాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. 2023 లో రిలీజ్ అయిన `12 త్ ఫెయిల్` సినిమాతో మరింత ఫేమస్ అయ్యాడు. ప్రస్తు తం చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు. ఇదే ఏడాది `అన్కూన్ కీ గస్టాకియాన్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. `యార్ జిగిర్`,` తాలా కూన్ మెయిన్ ఏక్` సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ రెండు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
