Begin typing your search above and press return to search.

నవ్వుల 'సంతాన ప్రాప్తిరస్తు'.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో హీరోయిన్లు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు.

By:  M Prashanth   |   11 Oct 2025 7:09 PM IST
నవ్వుల సంతాన ప్రాప్తిరస్తు.. రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ హీరో హీరోయిన్లు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్‌ భ్రమరం పాత్రలో వెన్నెల కిశోర్‌ నవ్వులు పంచనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంతాన ప్రాప్తిరస్తు మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్ తో పాటు టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు. సినిమాకు ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. శనివారం సాయంత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

చిల్డ్రన్ డే సందర్భంగా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఎంటర్టైన్మెంట్ డోస్ కు రెడీ అవ్వండంటూ క్యాప్షన్ ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని సరదాగా పిలుపునిచ్చారు. స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. అది ఫన్నీగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.

అయితే ప్రస్తుతం సమాజంలో యువ జంటలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకదానిని తీసుకుని సంతాన ప్రాప్తిరస్తు మూవీ రూపొందిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

దర్శకుడు సంజీవ్ రెడ్డి వినోదాన్ని భావోద్వేగంతో నైపుణ్యంగా మిళితం చేసి, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు రచయిత షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తుండగా.. అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.

సినిమాలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం సహా పలువురు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. మహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా.. డైలాగ్స్ కల్యాణ్ రాఘవ్ అందించారు. కాస్ట్యూమ్ డిజైనర్లుగా అశ్వత్ భైరి - కె ప్రతిభ రెడ్డి వ్యవహరించారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.