Begin typing your search above and press return to search.

రోలెక్స్ దరిదాపుల్లో కూడా రాలేదు..!

లోకేష్ తను రాసుకున్న సీన్స్ కి బడా స్టార్స్ ని పెట్టాలనుకోవడం వరకు ఓకే కానీ ఆ స్టార్ తాలూకా ఇమేజ్ ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు.

By:  Ramesh Boddu   |   15 Aug 2025 1:36 PM IST
రోలెక్స్ దరిదాపుల్లో కూడా రాలేదు..!
X

రజనీ కూలీ సినిమా నిన్నంతా మిక్సెడ్ టాక్ తో మాట్లాడుకున్నారు. కానీ లోకేష్ కనకరాజ్ ఇంత పెద్ద భారీ స్టార్ కాస్ట్ పెట్టి ఎందుకు అంత పేలవమైన పనితనం చూపించాడు అన్నది చర్చిస్తున్నారు. అంతేకాదు ఖైదీ, విక్రం తీశాడని అతని మీద మనమే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నావేమో అని కూడా మాట్లాడుతున్నారు. కూలీ విషయంలో అన్ని వేళ్లు లోకేష్ వైపే చూపిస్తున్నాయి. ఐతే ఈ సినిమాలో దాహా రోల్ లో అమీర్ ఖాన్ ని తీసుకున్నాడు లోకేష్.

అమీర్ ఖాన్ రెమ్యూనరేషన్ లేకుండానే ..

రజనీ సినిమా అనగానే అమీర్ ఖాన్ మిగతా విషయాలేవి పట్టించుకోకుండానే ఓకే అనేశారట. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఎలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. ఐతే ఫలితం బాగుంటుందనే ఉద్దేశ్యంతో అమీర్ ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే విక్రం సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ రోల్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూర్య రోలెక్స్ తో పోలుస్తూ అమీర్ దాహాని ప్రమోట్ చేశారు. కానీ సినిమా చూశాక రోలెక్స్ కాదు దాని దరిదాపుల్లో కూడా ఈ రోల్ లేదనిపించింది.

ఎందుకంటే దాహా అమీర్ ఖాన్ ని మిస్ యూజ్ చేశాడు లోకేష్. అతని లుక్ నుంచి అంతా వేస్ట్ అనిపించింది. అమీర్ ఖాన్ ని తీసుకునే వరకు బాగా కష్టపడిన లోకేష్ ఆయన్ను వాడుకోవడం లో మాత్రం విఫలమయ్యాడు. అమీర్ ఖాన్ కూడా కూలీ సినిమాపై మంచి ఆసక్తితో పనిచేశాడు. కానీ ఆడియన్స్ నుంచి మాత్రం అమీర్ ఖాన్ ని లోకేష్ సరిగా యూజ్ చేసుకోలేదని అనుకుంటున్నారు.

స్టార్ తాలూకా ఇమేజ్ ని మాత్రం మ్యాచ్ చేయలేదు..

లోకేష్ తను రాసుకున్న సీన్స్ కి బడా స్టార్స్ ని పెట్టాలనుకోవడం వరకు ఓకే కానీ ఆ స్టార్ తాలూకా ఇమేజ్ ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు. ఒక సాధారణ పాత్రలకు స్టార్సే ఎందుకన్నది లోకేష్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూలీ సినిమాలో మిగతా పాత్రలకు కూడా ఇలాంటి అన్యాయమే జరిగింది.

నాగార్జున రోల్ కూడా ఎంత హైప్ ఎక్కించాడో అంత నీరుకార్చేశాడు. అమీర్ పాత్ర గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. అసలే అమీర్ ఖాన్ విక్రం లో రోలెక్స్ తరహా రోల్ అని రిలీజ్ ముందు హంగామా చేయగా తీరా సినిమా చూసిన ఆడియన్స్ కి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. అమీర్ ఖాన్ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ తోనే ఒక సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. మరి కూలీ ఎఫెక్ట్ ఆ సినిమా మీద ఉంటుందా లేదా అన్నది చూడాలి. కూలీతో కోలీవుడ్ కి లోకేష్ 1000 కోట్లు తెస్తాడని ఆశపడ్డ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే మిగిలేలా ఉంది.