Begin typing your search above and press return to search.

ఘాటీతో విక్రమ్ ప్రభు.. సమ్ థింగ్ స్పెషల్!

విక్రమ్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదనే చెప్పాలి. ఎందుకంటే అతని తొలి చిత్రం కుమ్కిను గజరాజు పేరుతో తెలుగులో విడుదల చేశారు.

By:  M Prashanth   |   27 Aug 2025 5:48 PM IST
ఘాటీతో విక్రమ్ ప్రభు.. సమ్ థింగ్ స్పెషల్!
X

టాలీవుడ్‌లో ‘ఘాటీ’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అరుదైన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన హీరో విక్రమ్ ప్రభు చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగులో ఫోకస్ అవుతున్నాడు.


విక్రమ్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదనే చెప్పాలి. ఎందుకంటే అతని తొలి చిత్రం కుమ్కిను గజరాజు పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘ఘాటీ’ ద్వారా మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ఓ కీలకపాత్ర పోషించడమే కాకుండా, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి నిజమైన ఫీలింగ్‌ను తెచ్చారని సమాచారం.

చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం, విక్రమ్ ప్రభు ఈ చిత్రంలో చూపించిన యాక్టింగ్ ప్రత్యేకంగా నిలుస్తుందట. కళ్లలోని ఎమోషన్‌తోనే పాత్రను ఎలివేట్ చేసిన విధానం కూడా హైలెట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన తాత, లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ సినీ వారసత్వాన్ని గుర్తు చేసుకునేలా ఓ సాంగ్‌లో కూడా స్పెషల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. "సైలొరే" అనే పాటలో శివాజీకి సంబంధించిన ట్యూన్‌ని జోడించారు. ఇది సినీ అభిమానుల్లో ఒక ఎమోషనల్ కనెక్ట్‌ని కలిగిస్తోంది.

అనుష్క శెట్టి పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, విక్రమ్ ప్రభు ఆమెకు సరితూగే ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌ చేశారట. ఈ కాంబినేషన్ తెరపై కొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ చూసినవారంతా ఈ జంట లుక్స్‌కి ఇంప్రెస్ అవుతున్నారు. ‘ఘాటీ’ను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నాయి.

యాక్షన్, డ్రామా, ఎమోషన్‌ల కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీని సెప్టెంబర్ 5న మల్టీ లాంగ్వేజ్‌లో విడుదల చేయనున్నారు. అద్భుతమైన విజువల్స్, టెక్నికల్ వర్క్‌తో కూడిన ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, ‘ఘాటీ’ ద్వారా విక్రమ్ ప్రభు తెలుగు తెరపై మరోసారి తన ప్రతిభను చాటుకోబోతున్నారు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.