సినిమా తర్వాతే భార్య.. స్టార్ హీరో లైఫ్‌లో షాకింగ్ ట్విస్ట్
అయితే పెళ్లి తర్వాత వెర్షనే వేరు. సినిమాల తర్వాత ఎప్పుడూ భార్య తన `రెండో ప్రేమ` అని, పెళ్లి అంటే రాజీకి రావడం అని తన భార్యతో చెప్పానని విక్రమ్ చెప్పారు.
By: Sivaji Kontham | 1 Nov 2025 5:00 AM ISTకెన్నెడీ జాన్ విక్టర్ .. చియాన్ విక్రమ్ అసలు పేరు. రంగస్థలంపై పేరు `విక్రమ్`. ఇదే అతడి పాపులర్ నేమ్. అతడికి భార్య ఇద్దరు పిల్లలు. తన వారసుడు విక్రమ్ తమిళ చిత్రసీమలో రాణించేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ధృవ్ అందంలో, నటనలో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు.
విక్రమ్ మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ తన కుటుంబం, భార్య గురించి అంతగా పరిచయం చేయనేలేదు. మీడియా గ్లేర్‌కు అతడి కుటుంబం దూరంగా ఉంది. చాలా కాలానికి చియాన్ తన వివాహం గురించి మాట్లాడాడు. తన భార్య శైలజా బాలకృష్ణన్‌తో మొట్టమొదటి సమావేశం గురించి గుర్తు చేసుకున్నాడు.
తన సతీమణితో లవ్ ఎలా మొదలైందో విక్రమ్ స్వయంగా వెల్లడించాడు. ఆమె హిందూ అయితే, తాను క్రిస్టియన్. అందువల్ల ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లాడటం చాలా కష్టమైంది. కేరళ హిందూ కుటుంబంలోని అమ్మాయి శైలజ బాలకృష్ణన్. కానీ తనకు ఫిట్ నెస్ కోచ్ గా పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడిపోయానని విక్రమ్ చెప్పారు. తనకు ప్రమాదం జరిగి కాలు తీసేయాల్సిన పరిస్థితిలో 23 ఆపరేషన్లు జరిగాయి. కాలు తీసేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ సమయంలో శైలజ తనకు అండగా నిలిచింది. తనతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. తర్వాత పెద్దల్ని ఒప్పించి హిందూ క్రిస్టియన్ రెండు సాంప్రదాయాలలో రెండుసార్లు వివాహం చేసుకున్నాడు.
అయితే పెళ్లి తర్వాత వెర్షనే వేరు. సినిమాల తర్వాత ఎప్పుడూ భార్య తన `రెండో ప్రేమ` అని, పెళ్లి అంటే రాజీకి రావడం అని తన భార్యతో చెప్పానని విక్రమ్ చెప్పారు. తన ప్రేమ వివాహానికి ఎదురైన మతపరమైన చిక్కుల గురించి, సాంస్కృతిక నేపథ్యాల కారణంగా పెళ్లికి ముందు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఈ జంట ప్రేమ వివాహం ఒక సినిమాకి ఎంతమాత్రం తక్కువ కాదు.
ఆమె మలయాళీ.. నేను తమిళుడిని... ఈ రోజు లివ్ ఇన్ రిలేషన్‌లు ఉన్నాయి. కానీ అప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడటం కూడా నిషేధం. ఎవరితోనైనా కాదు... నేను సగం హిందువుని ..ఆమె మలయాళీ.. మా మధ్య లవ్ కొనసాగుతోంది. నేను ఆమెను కలిసినందుకు హ్యాపీగా ఉంది. ఆమెతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను! అని విక్రమ్ చెప్పాడు.
మంచి తల్లి.. స్నేహితురాలు అంటూ భార్యను పొగడ్తల్లో ముంచేసాడు విక్రమ్. చిన్నప్పుడు ఎలా ఉన్నా నాలో మార్పు అమ్మ వల్లనే. నేను వివాహం చేసుకున్న తర్వాత నా భార్య కారణంగా ఈ మార్పు. ఆమె ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచింది. ఆమె మనస్తత్వవేత్త.. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తుంది. ఆమె దేవదూత…తనను మొదటిసారి చూసినప్పుడు గుడిలో గంటలు మోగినట్లు నాకు చెప్పింది.. నేనే తన భర్త అని తనకు తెలియడానికి ఏదో జరిగిందని కూడా విక్రమ్ అన్నారు.
నటనలో కొనసాగడానికి తన భార్య అంగీకరించలేదని, కానీ నటనకే తన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం పూర్తి భిన్నం. నాకు ఏసీ కావాలి... తనకు ఫ్యాన్ కూడా వద్దు. నేను ఆడంబరమైన దుస్తులు ధరిస్తాను. ఆమె సింపుల్ గా ఉంటుంది. ఆమె కుటుంబంలో కవులు పండితులు ఉన్నారు. నేను కేవలం నటుడిని. మొదట్లో ఆమె నన్ను మార్చడానికి ప్రయత్నించింది. కానీ నేను ``ఒక విషయం సూటిగా చెప్పండి``అది నా మొదటి ప్రేమ, నువ్వే నా రెండవ ప్రేమ.. అది పని చేయకపోతే ఇది పని చేయదు`` అని అన్నాను. కొన్ని సార్లు నా సినిమాలు ఆడకూడదని కోరుకుంది. కానీ ఇప్పుడు ఆమె నా ప్రయాణంలో భాగం అని విక్రమ్ తెలిపాడు.
కొన్నేళ్లుగా భార్యా భర్తల నడుమ తప్పులు ఉన్నాయని అర్థం చేసుకున్నామని కూడా చెప్పాడు. కానీ వివాహ బంధంలో చాలా తెలుసుకోవాలని అన్నారు. విక్రమ్ అతడి భార్య ఇద్దరు పిల్లలతో ఎంతో అన్యోన్య జీవితం సాగిస్తున్నారు. ఒక కుమార్తె, ఒక కుమారుడు అతడికి ఉన్నారు. వారసుడు కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు.
