Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ డైల‌మాలో ప‌డిందా!

చియాన్ విక్ర‌మ్ కథానాయ‌కుడిగా ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   30 Sept 2025 7:00 PM IST
వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ డైల‌మాలో ప‌డిందా!
X

చియాన్ విక్ర‌మ్ కథానాయ‌కుడిగా ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నారు. విక్ర‌మ్ బిజీ షెడ్యూల్ అనంత‌రం ముందుగా ఈ సినిమాకే డేట్లు ఇస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆదిలోనే అట‌కెక్కాలా ఉంద‌న్న‌ది తాజా అప్డేట్. ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తలెత్తిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. విక్ర‌మ్ కి... ప్రేమ్ కుమార్ రెండు స్టోరీలు నేరేట్ చేసారుట‌. కానీ రెండింటిలో ఏదీ కూడా ఫైనల్ అవ్వ‌లేద‌న్న‌ది తాజా స‌మాచారం.

క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణ‌మా:

ప్రేమ్ కుమార్ చెప్పిన రెండు స్టోరీలు కాకుండా ఓ ల‌వ్ స్టోరీ కావాల‌ని విక్ర‌మ్ అడిగాడుట‌. రెండు సింట్టింగ్ ల త‌ర‌వ్ఈత విష‌యం చెప్ప‌డంతో ప్రేమ్ కుమార్ సున్నితంగా విక్ర‌మ్ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌ళ్లీ కొత్త‌గా ల‌వ్ స్టోరీ రాయాలంటే కొన్ని నెల‌లు స‌మ‌యం కేటాయించాల‌ని...ఇలా చేస్తే గ‌నుక తాను రాసిన రెండు క‌థ‌లు ఔడెటెడ్ అయిపోతాయ‌ని త‌న ఇబ్బందిని విక్ర‌మ్ ముందు ఉంచాడుట‌. అయినా స‌రే విక్ర‌మ్ ఆ క‌థ‌ల‌కు నో చెప్పాడుట‌. దీంతో ప్రాజెక్ట్ ర‌ద్ద‌యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ ఉండదు.

64వ చిత్రంలో ఇబ్బందులా:

మ‌రి ఈ ప్ర‌చారంపై విక్ర‌మ్-ప్రేమ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం విక్ర‌మ్ తాను చేయాల్సిన 63,64వ చిత్రాల‌ను ప్ర‌క‌టించాడు. కానీ ఇంకా వేటిని ప‌ట్టాలెక్కించ‌లేదు. 64వ చిత్రంగా ప్రేమ్ కుమార్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించారు. దీంతో విక్ర‌మ్ ముందుగా 63వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. అలాగే ప్రేమ్ కుమార్ `96` కి సీక్వెల్ గా `96- 2` పేరిట మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొన్ని నెల‌లు పాటు ప్రేమ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ తోనే బిజీగా ఉంటాడు. అనంత‌ర విక్ర‌మ్ సినిమాపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. విక్ర‌మ్ మాత్రం స‌క్సెస్ పుల్ కంటెంట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు.

సక్సెస్ కోసం చియాన్ ఎదురు చూపు:

చియాన్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. వైవిథ్య‌మైన కంటెంట్ తో వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా? ఫ లించడం లేదు. `తంగ‌లాన్` తో మంచి అటెంప్ట్ చేసినా క‌మ‌ర్శియ‌ల్ గా పెద్ద‌గా వర్కౌట్ అవ్వ‌లేదు. ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఓ కొత్త అనుభూతిని పంచిన చిత్రంగా నిలిచింది. అటుపై రిలీజ్ అయిన `వీర దీర శూర` కూడా డివైడ్ టాక్ తోనే ఆడింది. తెలుగు ఆడియ‌న్స్ కు పెద్ద‌గా క‌నెక్ట్ కాని చిత్రంగానే మిగిలిపోయింది.