Begin typing your search above and press return to search.

అభిమానుల్ని అదుపు చేయాల్సింది హీరోలే!

సినిమా -రాజ‌కీయం రెండు వేర్వేరు రంగాలు. ఎంత మాత్రం ఆ రెండింటిని ముడి పెట్టి మాట్లాడానికి లేదు. కానీసినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి వెళ్తేనే? ముడిపెట్టి మాట్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డుతుంటాయి. ఎ

By:  Srikanth Kontham   |   28 Dec 2025 1:49 PM IST
అభిమానుల్ని అదుపు చేయాల్సింది హీరోలే!
X

సినిమా -రాజ‌కీయం రెండు వేర్వేరు రంగాలు. ఎంత మాత్రం ఆ రెండింటిని ముడి పెట్టి మాట్లాడానికి లేదు. కానీసినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి వెళ్తేనే? ముడిపెట్టి మాట్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డుతుంటాయి. ఎన్టీఆర్ త‌ర్వాత చాలా మంది న‌టులు రాజకీయాల్లోకి వెళ్లారు. వాళ్ల‌లో కొంద‌రు స‌క్సెస్ అయ్యారు . మ‌రికొంత మంది ఫెయిల్యారు. కానీ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్ర‌భావం కూడా అంత‌గా లేదు. దీంతో న‌టుల‌పై ఎలాంటి విమ‌ర్శుల‌న్నా..ప్ర‌శంస‌లున్నా? పెద్ద‌గా వెలుగులోకి వ‌చ్చేవి కాదు. కానీ నేటి సోష‌ల్ మీడియా స‌మాజంపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తుందో తెలిసిందే.

సినిమా న‌టులు సినిమా గురించి త‌ప్ప రాజ‌కీయం స‌హా ఇత‌ర ఏ విష‌యాలు మాట్లాడినా? మీడియాలో అవే హైలైట్ అవుతున్నాయి. వాటికి వంతు పాడ‌టం అభిమానుల ప‌నైంది. సినిమా వేదిక సైతం రాజ‌కీయ వేక‌దిగా మారిపో తుంది. ఈ ర‌క‌మైన ప‌రిస్థితులు త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి ఆ ప్రభావం అభిమానులపై ఎంత‌గా ఇంపాక్ట్ అయిందో క‌నిపించింది. రజ‌కీయ‌ అభిమానులు స‌హా ప‌వ‌న్ సినిమా అభిమానులు కూడా ఇందులో భాగ‌మయ్యారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క‌ర‌కాల ప‌రిస్థితుల‌కు దారి తీసిన ఉదంతాలున్నాయి. సినిమా వేదికైతే అది పోలిటిక‌ల్ వేదిక‌గా మార‌డం..పొలిటిక‌ల్ వేదికయితే సినిమా వేదిక‌గా మార‌డం అన్న‌ది ప‌రిపాటిగా మారింది. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన `జ‌న నాయ‌గ‌న్` ఆడియో వేడుక రాజ‌కీయ వేదిక‌గా మారిపోయింది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగింది. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆడియో లాంచ్ లో భాగంగా విజ‌య్ వేదిక‌పైకి రాగానే? అతనికి, పార్టీకి అనుకూలంగా నినాదాలు మార్మోగాయి.

`టీవీకే .. టీవీకే` అంటూ నిన‌దించారు. దీంతో అది సినిమా వేదికా? పొలిటిక‌ల్ వేదికా? అన్న‌ది సందేహాంగా మారింది. అయితే ఈ విష‌యంలో అభిమానుల్ని అదుపు చేయాల్సిన పూర్తి బాద్య‌త అన్న‌ది ఆ హీరోల‌పైనే ఉంది. అభిమానుల్లో అవేర్ నెస్ లేక‌పోవ‌డంతోనే ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌ని ఆ మ‌ధ్య ఓ స‌ర్వే కూడా తేల్చింది. అత్యుత్సాహానికి పోయి చేసే హ‌డావుడి విషయంలో హీరోలు త‌లుచుకుని బాద్య‌త తీసుకుంటే త‌ప్ప మార్పు రాద‌ని మాన‌సిక నిపుణులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.