Begin typing your search above and press return to search.

త్రిష‌తో ప‌బ్లిగ్గా ద‌ళ‌ప‌తి విజ‌య్.. రాజ‌కీయంగా ఇది ప్ల‌స్సా? మైన‌స్సా?

దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ గత కొన్నాళ్లుగా చాలా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   6 March 2026 9:11 AM IST
త్రిష‌తో ప‌బ్లిగ్గా ద‌ళ‌ప‌తి విజ‌య్.. రాజ‌కీయంగా ఇది ప్ల‌స్సా? మైన‌స్సా?
X

దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ గత కొన్నాళ్లుగా చాలా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీత సోర్నలింగంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్ స‌హా త‌మిళ‌నాడు పొలిటిక‌ల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్ తన చిరకాల స్నేహితురాలు, నటి త్రిష కృష్ణన్‌తో కలిసి హాజరుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల వార్తలు ముదురుతున్న వేళ వీరిద్దరూ ఇలా బహిరంగంగా జంటగా కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

విజయ్ భార్య సంగీత 2025 డిసెంబర్‌లోనే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఫిర్యాదులో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని.. తనను మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా నిర్లక్ష్యం చేశారని సంగీత‌ ఆరోపించారు. అవసరమైతే ఆ నటిని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేరుస్తానని సంగీత పేర్కొనడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

నిజానికి విజయ్- సంగీతల ప్రేమకథ ఒక సినిమాను తలపిస్తుంది. విజయ్‌కి వీరాభిమాని అయిన సంగీత అత‌డిని కలిసి ప్రేమలో పడి 1999 ఆగస్టు 25న పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. క్రైస్తవ మతానికి చెందిన విజయ్, హిందూ సంప్రదాయం ప్రకారం సంగీతను పెళ్లాడారు. వీరికి సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దశాబ్ద కాలానికి పైగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య 2023 నుంచి మనస్పర్థలు మొదలైనట్లు వార్తలు వచ్చాయి. `వారసుడు` (వారిసు) సినిమా వేడుకలకు.. ఆ తర్వాత విజయ్ రాజకీయ పార్టీ `తమిళగ వెట్రి కళగం` కీలక కార్యక్రమాలకు సంగీత హాజరుకాకపోవడంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరింది.

మరోవైపు విజయ్ - త్రిషల కెమిస్ట్రీ వెండితెరపై ఎంతటి మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. `గిల్లి` సినిమాతో మొదలైన వీరి ప్రయాణం బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించింది. అయితే వీరిద్దరి మధ్య వృత్తిపరమైన సంబంధం అంత‌కుమించి ఇంకేదో ఉందనే గాసిప్పులు గతంలోనూ వచ్చాయి. ఇప్పుడు విడాకుల పిటిషన్‌లో సంగీత పేర్కొన్న ``ఆ నటి త్రిషనేనా?`` అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. వీరిద్దరూ కలిసి ఒకే ఈవెంట్‌లో కనిపించడం గాసిప్ రాయుళ్లకు మరింత పని పెట్టింది.

రాజకీయ కోణంలో చూస్తే.. ఇది విజయ్‌కి పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు. విడాకుల కేసులో భార్య చేసిన వివాహేతర సంబంధం, మానసిక వేధింపులు వంటి ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధాలుగా మారవచ్చు. ప్రజల్లో క్లీన్ ఇమేజ్ పొందాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యక్తిగత వివాదాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

అయితే విజయ్ మాత్రం ఈ గాసిప్పులను, విడాకుల వార్తలను ఏమాత్రం లెక్కచేయనట్లుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా త్రిషతో కలిసి కనిపించడం ద్వారా తాను దేనికీ భయపడటం లేదనే సంకేతాన్ని ఇస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగినది అని భావించ‌లేం. ఏది ఏమైనా.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ విజయ్ వ్యక్తిగత జీవితం ఇంతలా రచ్చకెక్కడం ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది.