Begin typing your search above and press return to search.

వ‌ర్మ ఆయ‌న మాట‌ల్ని సీరియ‌స్ గా తీసుకున్నారా?

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ సినిమాల విష‌యంలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   23 Aug 2025 1:39 PM IST
వ‌ర్మ ఆయ‌న మాట‌ల్ని సీరియ‌స్ గా తీసుకున్నారా?
X

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ సినిమాల విష‌యంలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌బ్లిక్ వేదిక‌పైనా తాను చూసిన వ‌ర్మ వేరే అని...ఇత‌ను పాత వ‌ర్మ కాద‌ని... మ‌ళ్లీ ఆ వ‌ర్మ కావాలంటూ స్టార్ రైట‌ర్ డిమాండ్ చేసారు. ఆయ‌న మాట‌ల్ని..ఎక్స్ ప్రెష‌న్స్ ముందుకు కూర్చుని అంతే తదేశంగా వ‌ర్మ సైతం చూసారు. నేనింత చెత్త సినిమాలు తీస్తున్నా? అని త‌న‌లో తానే ఓ ప్ర‌శ్న‌ వేసుకునేలా? వాస్త‌వాన్ని గ్ర‌హించేలా? వ‌ర్మ‌ని ఆలోజింపచేసాయి ఆయ‌న వ్యాఖ్య‌లు.

ఆ దిశ‌గా అడుగులు:

ఇది జ‌రిగి నాలుగేళ్లు అవుతుంది. ఆ త‌ర్వాత వ‌ర్మ ఓ మూడు నాలుగు సినిమాలు చేసాడు. అవే `కొండా`, `వ్యూహం`, `డ్రాగ‌న‌ర్ గ‌ర్ల్`, `డేంజ‌ర‌స్ గాళ్` లాంటి చిత్రాల‌వి. కానీ ఇవేవి హిట్ అవ్వ‌లేదు. వాటిలో వ‌ర్మ మార్క్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ కోరుకుంది ఇప్ప‌టి వ‌ర్మ‌ను కాదు..శివ కాలం నాటి వ‌ర్మ‌ను. మ‌రి ఆదిశ‌గా వ‌ర్మ అడుగులు వేస్తున్నాడా? స్టార్ రైట‌ర్ మాట‌ల్ని వ‌ర్మ ఇప్పుడు సీరియ‌స్ గా తీసుకున్నాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. `వ్యూహం` రిలీజ్ అయి ఏడాద‌వుతుంది.

ఏడాదికాలంగా అదే ప‌నా:

అప్ప‌టి నుంచి రాంగో పాల్ వ‌ర్మ సినిమాలు చేయ‌లేదు. కొత్త ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. నిర్మాణంలో కూడా ఏ సినిమా కూడా తెరపైకి రాలేదు. అలాగే వివాదాల్లో కూడా ఆయ‌న పేరు వినిపించ‌డం లేదు. ఏపీలో కూట‌మీ కూడా అధికారంలోకి రావ‌డంతో వ‌ర్మ కూడా ఎందుకొచ్చిన త‌ల‌నొప్ప‌ని సైలెంట్ గా ఉన్నారు. మ‌రి ఇప్పుడు వ‌ర్మ ఏం చేస్తున్న‌ట్లు? అంటే సీరియ‌స్ గా ఆయ‌న ఓ స్టోరీ సిద్దం చేస్తున్నాడ‌ని తెలిసింది. స్టోరీ లైన్ ఏంటి? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు గానీ ఈస్టోరీపై మాత్రం వ‌ర్మ ఏడాది కాలంగా వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

వ‌ర్మ నుంచి క్లారిటీ ఎప్పుడు?

ఈ క్ర‌మంలో చెన్నై, ముంబై, హైద‌రాబాద్, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఎక్కువ‌గా తిరుగుతున్నారుట‌. ఆయా ప్రాంతాల్లో ప‌దిహేను రోజుల పాటు బ‌స చేస్తున్నాడుట‌. ఏడాది కాలంలో రెండుసార్లు ఆ ప్రాంతాలు చుట్టొచ్చిన‌ట్లు తెలిసింది. అక్క‌డ ప‌రిస్థితుల్ని ద‌గ్గ‌ర‌గా స్టడీ చేస్తున్నట్లు వినిపిస్తోంది. మ‌రో నెల రోజుల్లో అమెరికార‌కు వెళ్తాడ‌ని తెలిసింది. మ‌రి ఇన్ని ప్రాంతాల అన్వేష‌ణ వెనుక ఏమై ఉంటుందో? ఆయా ప్రాంతాల్లో జ‌రిగే క్రైమ్ ని ఎనాల‌సిస్ చేస్తున్నాడా? అనే సందేహం వ్య‌క్త‌మ వుతుంది. ఎందుకంటే వ‌ర్మ క‌థా వ‌స్తువు క్రైమ్ అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఆస‌లు సంగ‌తేంటి? అన్న‌ది వ‌ర్మ చెబితే గానీ క్లారిటీ రాదు.