Begin typing your search above and press return to search.

బిడ్డ మెడ చుట్టూ పేగు.. ఆ క్షణాలు గుర్తు చేసుకున్న సమంత అత్తగారు

సమంత డెలివరీ సమయంలో బాబు మెడ చుట్టూ బొడ్డుతాడు చుట్టుకోవడంతో కుటుంబంలో ఆందోళన నెలకొందని సింగర్ శోభారాజు వెల్లడించారు. వైద్యులు సిజేరియన్ సూచించడంతో కుటుంబ సభ్యులు హనుమాన్ చాలీసా చదివారు. చివరకు సమంతకు నార్మల్ డెలివరీ అయింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ సోదరి శీతల్ మూడు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను సందర్శించి బిడ్డ కోసం ప్రార్థించారు.

By:  Madhu Reddy   |   26 Nov 2026 2:17 PM IST
బిడ్డ మెడ చుట్టూ పేగు.. ఆ క్షణాలు గుర్తు చేసుకున్న సమంత అత్తగారు
X

పార్టీలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు... పార్టీ నుంచి బయటకు వచ్చాక జగన్మోహనరెడ్డి.. సొంత పార్టీ పెట్టాక జగన్ మోహన్.. మాజీ ఎంపీ, పీఆర్పీ వ్యవస్థాపకుడు వి.విజయసాయిరెడ్డి తన మాజీ బాస్ వైఎస్ జగన్మోహనరెడ్డిని పిలుస్తున్న తీరు ఇది.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమంటూ ఇన్నాళ్లు చెప్పుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు క్రమంగా జగన్ రెడ్డి విషయంలో తన వ్యతిరేకతను బయటపెడుతున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇందుకు మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని జగన్ మోహన్ అంటూ ఆయన సంభోదిస్తున్న తీరునే ఉదహరిస్తున్నారు. జగన్ అంటే అమితమైన భక్తిని ప్రదర్శించిన విజయసాయిరెడ్డిలో ఊహించని మార్పు రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారితీస్తుందన్న చర్చను లేవనెత్తుతున్నట్లు చెబుతున్నారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఓ మతానికి చెందిన వారని, ఆయనకు రెడ్డి సామాజికవర్గానికి సంబంధం లేదని చెప్పడంలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపులో మార్పు వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయసాయిరెడ్డి తన సొంత సామాజికవర్గ మద్దతును కూడగట్టుకునే పనిలో భాగంగా తానే అసలు సిసలు రెడ్డి నేతను అని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం జగన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి జగన్ మోహన్ అంటూ సరికొత్తగా పిలుస్తున్నారని చెబుతున్నారు. నిజానికి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రెండు ప్రధాన సామాజికవర్గాలలో ఒక దానికి మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సామాజికవర్గంలో ఆయనే తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. అయితే ఆయన మతం మారిపోయినందున కులం వర్తించదని విజయసాయిరెడ్డి వాదిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ సామాజికవర్గంతోపాటు రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.

వైసీపీలో అత్యంత కీలకంగా పనిచేసిన విజయసాయిరెడ్డి తన రాజకీయ ఆకాంక్షలు నెరవేరాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారా? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినా, ఆ పార్టీ అధిష్టానంలోని కొందరితో తీవ్రంగా విభేదించినా రాజకీయంగా పెద్ద గుర్తింపు రాలేదని అంటున్నారు. దీంతో రాజకీయంగా ఎదగాలంటే మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేయడం ఒక్కటే మార్గమని ఆయన గ్రహించినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయనతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రజలు మరచిపోయేలా ఉండేలా కాస్త కటువైన మాటలు ఆడేందుకు కూడా సిద్ధపడుతున్నారని చెబుతున్నారు.

మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయ సాయిరెడ్డి ఎన్నడూ లేనట్లు ఇప్పుడు జగన్ మోహన్ అంటూ పిలవడమే కాకుండా, జగన్ రెడ్డి రాజకీయ ఎదుగుదల, ఆయన ఆలోచన విధానం, కుటుంబంలో తలెత్తిన వివాదాలపైనా తనదైన విశ్లేషణలతో రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా జగన్ రెడ్డి నీడ నుంచి బయటపడేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందుకే తన స్వరాన్ని మార్చుకున్నారని, వైసీపీ అధినేతపై నేరుగా విమర్శల బాణాలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని చెబుతున్నారు.