Begin typing your search above and press return to search.

షాకింగ్: స్టార్ హీరో భార్య నిక‌ర‌ ఆస్తి విలువ 500 కోట్లు!

ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితంపైనా.. ముఖ్యంగా ఆయన భార్య సంగీత సోర్నలింగం ఆస్తుల వివరాలపైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   28 Feb 2026 2:00 PM IST
షాకింగ్: స్టార్ హీరో భార్య నిక‌ర‌ ఆస్తి విలువ 500 కోట్లు!
X

తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని మాస్ ఇమేజ్ కలిగిన దళపతి విజయ్ ఇటీవల రాజకీయ పార్టీ `తమిళగ వెట్రి కజగమ్` (టీవీకే) ని ప్రారంభించి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితంపైనా.. ముఖ్యంగా ఆయన భార్య సంగీత సోర్నలింగం ఆస్తుల వివరాలపైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ కంటే సంగీతకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయనే వార్తలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సంగీత సోర్నలింగం లండన్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి సోర్నలింగం యూకేలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. కుటుంబ నేపథ్యం పరంగా సంగీతకు భారీగా వారసత్వ ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. శ్రీ‌మ‌తి సంగీత విజ‌య్ నికర ఆస్తి విలువ రూ.400 కోట్ల నుండి రూ.500 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. లండన్‌లో త‌న అమ్మ త‌ర‌పు కుటుంబానికి ఉన్న స్థిరాస్తులు.. వ్యాపార పెట్టుబడుల ద్వారా ఈ స్థాయి సంపద చేకూరిందని సమాచారం. అయితే ఈ అంకెలకు సంబంధించి విజయ్ కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయ‌లేదు.

చెన్నైలో విజయ్ నివసించే ఖరీదైన భవంతుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న అత్యాధునిక బీచ్ హౌస్ దాదాపు 70 కోట్ల నుండి 80 కోట్ల విలువ కలిగి ఉంటుంది. ఇది విజయ్ పేరు మీద ఉండగా.. ఆయనకు శ్రీలంకలో కూడా ఖరీదైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సంగీత శ్రీలంక మూలాలు కలిగిన వ్యక్తి కావడంతో ఆ దేశంలో ఉన్న కొన్ని ప్రాపర్టీలు త‌న‌ పేరు మీద లేదా ఉమ్మడి పేరు మీద ఉండవచ్చని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది.

విజయ్- సంగీత 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. ఒక వీరాభిమానిగా విజయ్‌ని కలవడానికి లండన్ నుండి వచ్చిన సంగీత ఆ తర్వాత ఆయన జీవిత భాగస్వామిగా మారడం ఒక సినిమా క‌థ‌కు త‌క్కువేమీ కాదు. వీరికి కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. సంగీత సాధారణంగా మీడియాకు దూరంగా చాలా ప్రైవేట్‌గా ఉండటానికి ఇష్టపడతారు. కానీ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం, ఇటీవల వస్తున్న విడాకుల పుకార్ల నేపథ్యంలో ఆమె పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయని.. సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. నీలాంకరైలోని ఇంట్లో నివసించే హక్కు కోసం ఆమె కోర్టును కోరినట్లు కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. తాజాగా త‌మ వ్య‌క్తిగ‌త కుటుంబ విష‌యాలు ఇత‌రుల‌కు అన‌వ‌స‌రం అని విజ‌య్ త‌ర‌పున టీవీకే పార్టీ అధికారిక నోట్ రిలీజ్ చేసింది. విజ‌య్ మాత్రం ఇంకా దీనిపై స్పందించ‌లేదు.

విజయ్ తన రాజకీయ లక్ష్యాల వైపు దూసుకుపోతుండగా.. సంగీత లండన్‌లో తన కుటుంబ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సీఎం అవ్వాల్సిన విజ‌య్ కి వ‌రుస‌గా ఊహించ‌ని ఝ‌ల‌క్ లు త‌గులుతుండ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కుటుంబ వివాదం నేప‌థ్యంలో ఈ ఆస్తుల లెక్కలు ఏవైనా.. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఈ వ్యక్తిగత పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.