Begin typing your search above and press return to search.

ప్రేమికుల‌రోజు పోస్ట్‌తో అగ్గి రాజేసిన త‌మ‌న్నా మాజీ ప్రియుడు!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. అయితే గ‌త ఏడాది ఈ జంట త‌మ బ్రేక‌ప్ ని అధికారికం చేసారు.

By:  Sivaji Kontham   |   15 Feb 2026 12:28 PM IST
ప్రేమికుల‌రోజు పోస్ట్‌తో అగ్గి రాజేసిన త‌మ‌న్నా మాజీ ప్రియుడు!
X

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. అయితే గ‌త ఏడాది ఈ జంట త‌మ బ్రేక‌ప్ ని అధికారికం చేసారు. కెరీర్ సంబంధ నిర్ణ‌యాల‌తో ఈ జంట ఒక‌రి నుంచి ఒక‌రు దూర‌మ‌య్యార‌ని, అయినా స్నేహితులుగా కొన‌సాగుతున్నార‌ని ముంబై మీడియా క‌థ‌నాలు వండి వార్చింది. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత ఈ జంట ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కెరీర్ ప‌రంగా బిజీ బిజీగా మారారు. విజ‌య్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా, త‌మ‌న్నా కూడా అటు నార్త్, ఇటు సౌత్ ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది.




అయితే విజ‌య్ కొంత‌కాలంగా ఒక యువ‌తితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అత‌డి జీవితంలోకి ఒక కొత్త మ‌గువ వ‌చ్చి చేరింది. చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తున్నార‌ని గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ `వాలెంటైన్స్ డే` పోస్ట్ ఒక్క‌సారిగా అగ్గి రాజేసింది. తమన్నా భాటియాతో బ్రేకప్ త‌ర్వాత విజయ్ వ‌ర్మ‌ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద హల్‌చల్ సృష్టించింది. కానీ ఇక్క‌డే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇది కేవ‌లం ఫ్రాంకింగ్. అత‌డు త‌న ఫాలోవ‌ర్స్ ని ఫన్నీ ప్రాంక్ తో బురుడీ కొట్టించాడ‌ని తేలింది.

వైరల్ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం..

14ఫిబ్రవరి 2026 (శనివారం) వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ తన ఇన్‌స్టాలో ఒక మిస్టరీ గాళ్ చేయి పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. దానికి ``హ్యాపీ వేలెంటైన్స్ డే టు మై ఫ‌రెవ‌ర్`` అని క్యాప్షన్ ఇచ్చి `ఖుషి అహూజా` అనే హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీంతో విజయ్ కొత్తమ్మాయితో ప్రేమలో పడ్డారని, తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశారని అందరూ నమ్మేశారు. అయితే నెటిజన్లు ఆ ట్యాగ్ చేసిన అకౌంట్‌ను క్లిక్ చేసి చూసాక‌ అసలు విషయం బయటపడింది. ట్యాగ్ చేసిన అకౌంట్ ఏ అమ్మాయిది కాదు. అది ఒక ర్యాండమ్ అకౌంట్.

ఆ ఖాతాలోని పోస్ట్ లో ``మిమ్మల్ని వెర్రివాళ్లను చేశాను`` అనే మీమ్ క‌నిపించింది. దీంతో పాటు మీర్జాపూర్ సిరీస్‌లోని దడ్డా త్యాగి క్యారెక్టర్ ఫోటోలను జోడించారు. ఆ తర్వాత విజయ్ వర్మ కూడా ఒక మీమ్ షేర్ చేస్తూ, ఇదంతా కేవలం సరదా కోసం చేసిన ప్రాంక్ అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. విజ‌య్ వ‌ర్మ‌ ప్రస్తుతానికి `సింగిల్`గానే ఉన్నారని దీనిని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చేసింది.

విజయ్ వర్మ- తమన్నా భాటియా డేటింగ్ లైఫ్ గురించి వివ‌రాల్లోకి వెళితే... ఈ జంట‌ 2022 నుండి డేటింగ్‌లో ఉన్నారు. 2026 ప్రారంభంలో వీరిద్దరూ విడిపోయారు. అయినా వీరిద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. పాత ఫోటోలను కూడా డిలీట్ చేయలేదు. అందుకే వీరి బ్రేకప్ వార్తలపై ఇప్పటికీ కొంత‌ సందిగ్ధత కొనసాగుతోంది. మొత్తానికి విజయ్ వర్మ తనదైన శైలిలో వాలెంటైన్స్ డే రోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూనే, అందరినీ ఒక `ప్రాంక్`తో ఆటపట్టించారు.

విజ‌య్ వ‌ర్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, సిరీస్ ల‌తో బిజీగా ఉన్నాడు. త‌దుప‌రి `ఫ్యామిలీ బిజినెస్` అనే సిరీస్ లో న‌టిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ భారీ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇది ఒక కార్పొరేట్ వారసత్వ యుద్ధం నేపథ్యంలో సాగే ఇంటెన్స్ డ్రామా. హన్సల్ మెహతా దీనిని నిర్మిస్తున్నారు. మనీష్ మల్హోత్రా నిర్మాణంలో `బన్ తిక్కీ` అనే సినిమాలో విజయ్ వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో షబానా అజ్మీ , జెనీలియా కూడా నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య -దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సూర్య 43 చిత్రంలో విజయ్ వర్మ ఒక పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.