Begin typing your search above and press return to search.

బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ట్యాగ్‌పై విసుగెత్తిపోయిన విజయ్ వర్మ!

తెరపై విజ‌య్ పోషించే పాత్రలు చాలా వరకు టాక్సిక్ స్వభావం కలిగి ఉండటం, మోసపూరితమైన , భయపెట్టే వ్యక్తిత్వాలు ప్రదర్శించడంతో ప్రేక్షకులు ఆయనకు ఆ పేరు పెట్టారు.

By:  Srikanth Kontham   |   5 Oct 2026 7:47 PM IST
బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ట్యాగ్‌పై విసుగెత్తిపోయిన విజయ్ వర్మ!
X

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా డార్క్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో విజ‌య్ జీవించే విధానం ప్రశంసలను అందుకుంటుంది. అయితే వరుసగా అలాంటి రోల్స్ చేయడంతో ప్రేక్షకులు, నెటిజన్లు ఆయ‌న్ని స్క్రీన్‌పై బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అంటూ అభివర్ణించ‌డంపై విజయ్ వర్మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు. పాత్రల గురించి వస్తున్న కామెంట్స్‌పై సరదాగానూ, సీరియ‌స్ గానూ స్పందించారు. ఈ ట్యాగ్‌లైన్‌తో విసిగిపోయాన‌ని ఇకనైనా ఆ రంగును మార్చాలని పిలుపునిచ్చారు. `నేను దీనితో విసిగిపోయాను. దయచేసి నాకు మరేదైనా వేరే రంగును ఇవ్వండి` అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెరపై విజ‌య్ పోషించే పాత్రలు చాలా వరకు టాక్సిక్ స్వభావం కలిగి ఉండటం, మోసపూరితమైన , భయపెట్టే వ్యక్తిత్వాలు ప్రదర్శించడంతో ప్రేక్షకులు ఆయనకు ఆ పేరు పెట్టారు. `డార్లింగ్స్`, `దహాద్`, `మీర్జాపూర్` వంటి ప్రాజెక్ట్‌లలో ఆయన నటనకు ఎంతో పేరు వ‌చ్చినా? అదే సమయంలో విజ‌య్ కు రెడ్ ఫ్లాగ్ ఇమేజ్ స్థిరపడిపోయింది. ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుందని విజయ్ వర్మ స్పష్టం చేశారు. ఎప్పుడూ ఒకే రకమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ఇరుక్కుపోవడం ఇష్టం లేదని, కేవలం ఒకే రంగుకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతానని తెలిపారు.

నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి గ్రీన్ ఫ్లాగ్ లేదా రొమాంటిక్, సానుకూల పాత్రలు కూడా చేయాలని ఉందని మనసులోని మాట బయటపెట్టారు. పరిశ్రమలో నటులకు ఒక ఇమేజ్ రావడం సాధారణమే అయినా? ప్రేక్షకులు ప్రతిసారీ అదే కోణంలో చూడటం కొన్నిసార్లు పరిమితం చేస్తుందని విజయ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మ‌రిన్ని విభిన్నమైన, ప్రయోగాత్మకమైన పాత్రలతో పాటు ప్రేక్షకులు మెచ్చే పాజిటివ్ రోల్స్‌లోనూ కనిపించడానికి ఆసక్తిగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు.

చివ‌రిగా ఆన్-స్క్రీన్ రెడ్ ఫ్లాగ్ ట్యాగ్‌పై విజయ్ వర్మ ఫన్నీ రియాక్షన్ అభిమానులను నవ్విస్తోంది. నటుడిగా తన గ్రే షేడ్స్ పాత్రలతోనే కాకుండా.. బోల్డ్ అండ్ రియాలిస్టిక్ కామెంట్స్‌తోనూ విజయ్ వర్మ ఎప్పుడూ ట్రెండింగ్‌‌లో నిలుస్తుంటారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం.