Begin typing your search above and press return to search.

విజయ్ పార్టీ కోసం... తమన్‌ మళ్లీ ఫిదా చేసాడు

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారి పోయాడు. ఇప్పటికే ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని జనాల్లోకి తీసుకు వెళ్తున్నాడు.

By:  Ramesh Palla   |   22 Aug 2025 11:06 AM IST
విజయ్ పార్టీ కోసం... తమన్‌ మళ్లీ ఫిదా చేసాడు
X

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారి పోయాడు. ఇప్పటికే ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని జనాల్లోకి తీసుకు వెళ్తున్నాడు. తన చివరి సినిమా జన నాయగన్‌ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయింది. వచ్చే ఏడాది పొంగల్‌కి ఆ సినిమా రాబోతుంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయ్‌ తాజాగా మధురైలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ కొత్త గీతాన్ని ఆవిష్కరించారు. అంతే కాకుండా పార్టీ జెండాను ఆయన జనాల ముందుకు తీసుకు వెళ్లారు. పార్టీ కొత్త గీతానికి సంగీత దర్శకుడు తమన్‌ సంగీతాన్ని అందించాడు. గతంలోనూ విజయ్‌ పార్టీ కోసం తమన్‌ సంగీతాన్ని అందించాడు. అప్పుడు అభిమానుల, కార్యకర్తల యొక్క ప్రశంసలు దక్కించుకున్న తమన్‌, ఇప్పుడు మరో సారి పార్టీ గీతానికి సంగీతాన్ని అందించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

టీవీకే పార్టీ బహిరంగ సభ

విజయ్‌ యొక్క అద్భుతమైన విజువల్స్‌, పార్టీ జెండాతో పాటు, విజయ్ పార్టీ మీటింగ్‌కు వచ్చిన జనాలకు సంబంధించిన విజువల్స్‌ను వేసి తమన్‌ ట్యూన్‌ చేసిన పాట ప్లే చేస్తూ ఉంటూ అభిమానులు కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ పార్టీ గీతం వైరల్‌ అవుతోంది. తమన్‌ సినిమాల స్టైల్‌లో కాకుండా ఒక సామాజిక బాధ్యతతో పాటను ట్యూన్‌ చేసినట్లు అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. సినిమా సంగీత దర్శకుడు అనగానే అంతా కూడా పార్టీ గీతంను సినిమా పాట మాదిరిగా ఉంటుందని అనుకున్నారు. కానీ తమన్‌ తనదైన మార్క్‌ను చూపించకుండా, పార్టీ గీతం కనుక ఎలా ఉండాలో అలాగే ఉంది, ఎలా చేయాలో అలాగే చేశాడు అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు విజయ్‌ అభిమానులు, సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మధురై నుంచి విజయ్‌ పోటీ

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు విజయ్‌ నిన్నటి బహిరంగ సభలో ప్రకటించారు. అంతే కాకుండా తాను మధురై నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా కూడా క్లారిటీ ఇచ్చారు. మధురై తూర్పు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లుగా విజయ్ ప్రకటించిన వెంటనే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. మధురైలో విజయ్‌కి అభిమానులు ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా ఆయన మొదటి నుంచి మధురై ప్రాంతానికి రెగ్యులర్‌గా వెళ్లడంతో పాటు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న కారణంగా ఆయనకు అక్కడ నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ విజయ్ మాత్రమే కాకుండా టీవీకే నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గెలుస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తమన్ మ్యూజిక్‌కి అంతా ఫిదా

విజయ్‌ పార్టీ గీత బాధ్యతలను తమన్‌కి అప్పగించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన అడిగితే ఎంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్ట్‌ అయినా ముందుకు వస్తారు. అనిరుధ్‌, రెహమాన్‌లతో కాకుండా తమన్‌ తో తన పార్టీ గీతానికి సంగీతాన్ని ఇప్పించడం ద్వారా విజయ్‌ అతడిని ఎంతగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. తమన్‌ ఇంతకు ముందు సైతం సినిమాలకు కాకుండా కొన్ని కార్యక్రమాలకు ఇలాంటి సంగీతాన్ని అందించాడని, అందుకే విజయ్‌ చాలా నమ్మకంతో పార్టీ గీతం యొక్క బాధ్యతలను అప్పగించి ఉంటాడు అని కొందరు అంటున్నారు. తమన్‌ కి విజయ్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో టీవీకే పార్టీ గీతంను తమన్‌ చక్కగా ట్యూన్‌ చేశాడు. ముందు ముందు కూడా పార్టీకి సంబంధించిన వీడియోలకు, ఇతర కార్యక్రమాలకు తమన్‌ మ్యూజిక్‌ ఇస్తే బాగుంటుందని పార్టీ నాయకులు అంటున్నారు.