ఆ విషయాలు మీకు అనవసరం..!
ఈ సమయంలో వారి గురించి మీడియా వారి ఫోకస్ మరీ ఎక్కువ అయ్యింది. విజయ్‌తో పరిచయం ఉన్న వారు, ఆయనతో వర్క్ చేసిన వారు మీడియా ముందుకు వస్తే చాలు త్రిష ప్రస్థావన తీసుకు వస్తున్నారు.
By: Ramesh Palla | 17 May 2026 2:33 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ విజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఆయన గురించి చర్చ చూస్తున్నాం. అదే సమయంలో ఆయనకు త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. త్రిషతో విజయ్ రిలేషన్‌షిప్ గురించి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లు నిజమే అన్నట్లుగా విజయ్ ప్రమాణస్వీకారంకు త్రిష హాజరు అయ్యింది. అంతే కాకుండా ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే కచ్చితంగా విజయ్, త్రిష రిలేషన్‌లో ఉన్నారు, విడాకులు మంజూరు అయిన తర్వాత త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
విజయ్, త్రిష రిలేషన్ గురించి...
ఈ సమయంలో వారి గురించి మీడియా వారి ఫోకస్ మరీ ఎక్కువ అయ్యింది. విజయ్‌తో పరిచయం ఉన్న వారు, ఆయనతో వర్క్ చేసిన వారు మీడియా ముందుకు వస్తే చాలు త్రిష ప్రస్థావన తీసుకు వస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్‌లో ఉన్నారా అంటూ మీడియా వారు బయటి వారిని సైతం అడిగే వరకు పరిస్థితి వెళ్లింది. ఇటీవల హీరోయిన్ మాళవిక మోహనన్ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ గురించి మాళవిక మోహనన్ పలు విషయాలను పంచుకుంది. ఆయనతో వర్క్ చేసిన అనుభవం ఉన్న కారణంగా, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది. విజయ్ గొప్ప వ్యక్తి అని, అతడు సీఎం కావడం ఆనందంగా ఉందని కూడా మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది. అప్పుడే ఆమెను త్రిష గురించి స్పందించాలంటూ ఒక మీడియా వ్యక్తి కోరడంతో అసహనం వ్యక్తం చేసింది.
సీఎంగా విజయ్...
విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ మంది ఆసక్తి కనబర్చుతున్నారు. విజయ్ సార్ వెళ్లే ప్రతి చోటుకు త్రిష వెళ్తుంది, ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. దీని గురించి మీకు ఏమైనా తెలుసా? వారి రిలేషన్‌షిప్ గురించి మీకు ఏం తెలుసు? అన్నట్లుగా జర్నలిస్ట్ ప్రశ్నించడంతో మాళవిక మోహనన్ కాస్త అసహనంతో అతడికి సమాధానం ఇచ్చింది. మాళవిక మాట్లాడుతూ.. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాల గురించి మీకు అనవసరం. ఒకరి జీవితంలోకి వెళ్లి మరీ చర్చించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన జీవిత భాగస్వామి గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ మాట్లాడే అర్హత ఉండదు. ఆయన రాజకీయంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకు ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వాల్సిందే అన్నట్లుగా మాళవిక చెప్పుకొచ్చింది.
రాజాసాబ్ సినిమాలో...
విజయ్‌తో కలిసి ఈమె మాస్టర్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే తెలుగులో ఈమె రాజాసాబ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ వంటి సూపర్ స్టార్‌తో ఈమె తెలుగు సినిమాకు పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే ఈమెకు ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కింది. రాజాసాబ్ ఫలితంతో సంబంధం లేకుండా ఈమెకు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో ఈమెను సంప్రదించారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.
