Begin typing your search above and press return to search.

అప్పట్లో అలా.. ఇప్పట్లో ఇలా.. పార్థిబన్ తీరుపై నెట్టించ చర్చ!

అలాంటి సమయంలో ప్రముఖ నటుడు పార్థిబన్ కూడా విజయ్, త్రిష జంటను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   4 Jun 2026 12:53 PM IST
అప్పట్లో అలా.. ఇప్పట్లో ఇలా.. పార్థిబన్ తీరుపై నెట్టించ చర్చ!
X

కోలీవుడ్ సినీ నటుడిగా, దర్శకుడిగా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాధాకృష్ణన్ పార్థిబన్.. తన సినీ కెరియర్లో 16 చిత్రాలకు పైగా దర్శకత్వం.. 14 చిత్రాలకు పైగా నిర్మాణం.. 70 కి పైగా చిత్రాలలో నటుడిగా నటించి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తన అద్భుతమైన దర్శకత్వ మెళుకువలతో.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈయన.. ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

విజయ్ - త్రిష రిలేషన్ పై పార్థిబన్ కామెంట్లు..

ముఖ్యంగా విజయ్ తమిళనాట టీవీకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈసారి తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీవీకే పార్టీ ద్వారా పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఏకంగా తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అవతరించారు. అయితే ఆయన ఎన్నికల బరిలో దిగిన సమయంలో ప్రముఖ నటి త్రిషతో చనువుగా ఉండడం, ఈవెంట్లకు వెళ్లడమే కాకుండా ఇద్దరు కలిసి చెన్నైలో ఒక వివాహ వేడుకకు కలిసి వెళ్లడంతో ఈ విషయం కాస్త అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. అలాంటి సమయంలో ప్రముఖ నటుడు పార్థిబన్ కూడా విజయ్, త్రిష జంటను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సీఎం విజయ్ ను కలిసిన పార్థిబన్..

అలాంటి ఈయన ఇప్పుడు సీఎంగా విజయ్ అవతరించిన తర్వాత..ఆయనను సీఎం కార్యాలయంలో కలవడమే కాకుండా ఒక ఫోటో ఫ్రేమ్ ని కూడా బహుకరించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. అప్పట్లో అలా.. ఇప్పట్లో ఇలా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రత్యేకమైన బహుమతి..

ప్రముఖ నటుడు పార్థిబన్ తాజాగా మరో సీనియర్ నటుడు ఎంఎస్ భాస్కర్ తో కలిసి సీఎం విజయ్ కి పుష్పగుచ్చం అందించి.. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. రాజసం ఉట్టిపడే దుస్తులలో చక్రవర్తి గెటప్ లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ ని విజయ్ కి బహుమతిగా ఇచ్చారు. ఒకవైపున మోడల్ సైజు సింహాసనం అంటించి.. ఆ ఫోటో ఫ్రేమ్ ని బహుకరించడంతో ఈ ప్రత్యేకమైన బహుమతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ఫోటో ఫ్రేమ్ పై పార్థిబన్ తనదైన శైలిలో కొన్ని కవిత్వాత్మక పదాలను కూడా పొందుపరిచారు.

ఆ పదాలకు అర్థం..

ఇక తమిళంలో ఉన్న ఆ పదాలకు అర్థం ఏమిటంటే.." సినిమా రంగం నుండి ముఖ్యమంత్రి పీఠం వరకూ.. పవిత్రమైన , చందనపు ఛాయాలతో అలంకరించబడిన శాంతియుత , అస్తవ్యస్తత లేని పాలనను తీసుకురావడానికి గొప్ప పండితుడైన విజయ్ సింహాసనాన్ని అధిరోహించి.. అధికార పీఠాన్ని అలంకరిస్తున్నారు. రాజకీయ ప్రపంచాన్ని కదిలిస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందనలు" అంటూ తనదైన శైలిలో ఆ ఫోటో ఫ్రేమ్ పై తన అభిప్రాయాలను రాసుకొచ్చారు పార్థిబన్.ప్రస్తుతం పార్థిబన్ సీఎం విజయ్ ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ త్రిష రిలేషన్ గురించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటున్నారు.

ఆమెను బయటకి రానివ్వకూడదు..

తమిళనాడు ఎన్నికల సమయంలో త్రిషను ఉద్దేశించి.. "ఆమెను బయటకి రానివ్వకూడదు. కొన్నాళ్లు ఇంట్లోనే ఉంటే మంచిది" అంటూ పార్థిబన్ కామెంట్లు చేయగా.. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాంటి ఈయన ఇప్పుడు విజయ్ సీఎంగా పీఠాన్ని అధిరోహించిన తర్వాత కలవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా విజయ్ త్రిష రిలేషన్ ప్రచారం నేపథ్యంలో పార్థిబన్ భేటీ ఇప్పుడు చర్చకు దారితీసింది.