దళపతితో త్రిష చేసిన సినిమాలెన్నీ?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వివాదాల నిలయంగా మారుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
By: Ravindar Gorantla | 9 March 2026 4:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వివాదాల నిలయంగా మారుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీవీకే పార్టీని స్థాపించి సినిమాలకు గుడ్ బై చెబుతున్న విజయ్ తన చివరి సినిమాగా `జన నాయగన్`ని చేయడం, అది సెన్సార్ వివాదం కారణంగా రిలీజ్ అగిపోవడం తెలిసిందే. జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న మేకర్స్‌కు సెన్సార్ వారు షాక్ ఇవ్వడంతో రిలీజ్ ఆగిపోయింది. సీబీఎష్‌సీ రివైజింగ్ కమిటీకి సిఫారసు చేయడంతో ప్రొడ్యూసర్స్ ఫైనల్‌గా సూచించిన కట్స్‌ని తొలగించి రివైజింగ్ కమిటీ ముందుకు తీసుకెళ్లారు.
మార్చి 9, మధ్యాహ్నం 2 గంటలకు రివైజింగ్ కమిటీ సినిమా చూడబోతోంది. సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీలైతే ఇదే నెలలో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్రయించడం, చెంగల్‌పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టుకు సమర్పించిన పిటీషన్‌లో విజయ్ ఓ నటితో సంబంధాన్ని కలిగి ఉన్నాడని ఆరోపణలు చేయడంతో త్రిష పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా విజయ్, త్రిష కలిసి చెన్నైలోని ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో పాల్గొనడంతో సోషల్ మీడియాలో త్రిష, విజయ్‌పై చర్చ జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఎన్ని సినిమాలు చేశారు? ... ఏ సినిమా నుంచి వీరి జర్నీ మొదలైందనే చర్చ అభిమానులు, నెటిజన్‌ల మధ్య జరుగుతోంది. 2004 నుంచి 2024 వరకు విడుదలైన క్రేజీ సినిమాల్లో నటించారు. 2004లో `ఒక్కడు` ఆధారంగా రూపొందిన మూవీ `ఘిల్లి`. ధరణి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని విజయ్, త్రిష కెరీర్‌లో మైలురాయిగా నిలిచి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో 2005లో `తిరుప్పాచ్చీ` 2006లో `అతనొక్కడే` రీమేక్‌గా రూపొందిన `ఆది`, 2008లో `కురువి` వంటి బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్న విజయ్, త్రిష కలిసి 2023లో లోకేష్ కనగరాజ్ రూపొందించిన `లియో`లో నటించారు. ఇక 2024లో వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా విజయ్ డ్యుయెల్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` మూవీలోని స్పెల్ సాంగ్‌లో విజయ్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇద్దరి కాంబినేషన్‌లో ఐదు సినిమాలు రూపొందితే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాయి.
`కురువి` తరువాత వీరిద్దరు 14 ఏళ్లకు పైనే గ్యాప్ తీసుకున్నారు. సుధీర్ఘ విరామం తరువాత 2023లో `లియో`లో మళ్లీ కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, ఆ కారణంగానే విజయ్ వైఫ్ సంగీత విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేసిందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. వీటిపై విజయ్ స్పందించడం లేదు. ఇండైరెక్ట్‌గా స్పందించినా విడాకుల వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా కనిపించకపోవడం గమనార్హం.
