మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!
చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుకకు తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు కూడా వచ్చారు. నూతన వధూవరులతో కలిసి వీరంతా దిగిన గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్, త్రిష కలిసి కనిపించడంతో వారి సంబంధంపై వస్తున్న ఊహాగానాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
By: Priya Chowdhary Nuthalapti | 6 Nov 2026 7:13 AM ISTకోలీవుడ్లో ప్రస్తుతం విజయ్, త్రిష పేర్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలకు తోడు విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆ రూమర్స్ కి బలం చేకూర్చాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు వార్త కూడా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసి. అయితే ఈ విషయాలపై విజయ్, త్రిష ఇద్దరూ బహిరంగంగా స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ కలిసి ఒకే వేడుకలో అది కూడా కొన్ని పెళ్లిళ్లలో కనిపివ్వడం సోషల్ మీడియాలో ఎన్నో చర్చలకు దారితీస్తుంది.
ఈరోజు మరోసారి చెన్నైలో జరిగిన వైఎస్సార్ కుటుంబ వివాహ వేడుకకు తమిళ సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. త్రిషతో కలిసి హాజరయ్యారు. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి హాజరయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సతీమణితో వచ్చారు. ఈ వేడుకలో విజయ్, త్రిషతో పాటు జగన్, భారతి, కేటీఆర్ దంపతులు నూతన వధూవరులతో కలిసి ఫొటో దిగారు.
ఈ గ్రూప్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా విజయ్, త్రిష కలిసి కనిపించడంతో అభిమానులు మరోసారి వీరి గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సంబంధంపై అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో మరింత ఆసక్తిని పెంచింది.
మరోవైపు, విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రతి అడుగు సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. అభిమానులు మాత్రం ఈ రూమర్లకు ముగింపు పలికేలా విజయ్ స్పందించాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా మరీ ఇంతలా ఇద్దరు కలిసి పెళ్లిలో కనిపించాలా అని కూడా కామెంట్లు పెడుతున్నారు.
