Begin typing your search above and press return to search.

ఇక‌పై వారిద్ద‌రు ఒకే మాట‌..ఒకే బాట‌!

ప్రస్తుతం తమిళ రాజకీయ, సినీ రంగాల్లో సరికొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   12 May 2026 11:08 PM IST
ఇక‌పై వారిద్ద‌రు ఒకే మాట‌..ఒకే బాట‌!
X

ప్రస్తుతం తమిళ రాజకీయ, సినీ రంగాల్లో సరికొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. అగ్ర నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంత‌రం సినీ పరిశ్రమలోని ప్రముఖులతో ఆయనకు ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి విజయ్ గురించి సానుకూలంగా స్పందించడం ఇరు వర్గాల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిణామం కోలీవుడ్‌లో అగ్ర తారల మధ్య ఉండే పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది. నేడు మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి విజయ్ పాలన , రాజకీయ ప్రస్థానం గురించి అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ అత్యంత హుందాగా స్పందించారు.





విజయ్ తన పట్ల చూపిస్తున్న నిబద్ధతను, ప్రజల కోసం ఆయన పడుతున్న తపనను రజనీ కొనియాడారు. రజనీ కాంత్ వంటి దిగ్గజం, తోటి నటుడు ప్రస్తుత రాజకీయ నాయకుడిపై ఇలాంటి ప్రశంసలు కురిపించడం తమిళ రాజకీయాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. రజనీకాంత్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ స్పందించి సూపర్ స్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రజనీకాంత్ తనపై చూపిన నమ్మకం , అందించిన శుభాకాంక్షలు తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నాయని విజయ్ పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో తనకు సీనియర్ అయిన రజనీకాంత్ నుండి ఇలాంటి మద్దతు ద‌క్క‌డం త‌న రాజకీయ ప్రయాణంలో గొప్ప ప్రోత్సాహమని అభి ప్రాయపడ్డారు. ఈ ప్రతిస్పందన ఇద్దరి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

గతంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల కోసం పోటీ పడిన ఇద్దరు దిగ్గజాలు సామాజిక , రాజకీయ వేదికలపై పరస్పర గౌరవాన్ని ప్రదర్శించడం విశేషం. రజనీకాంత్ అభిమానులు , విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ ప రిణామాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు. సినిమాల పరంగా ఇద్ద‌రి మధ్య ఎంతటి పోటీ ఉన్నా? వ్యక్తిగతంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇద్ద‌రు ఒకే మాటపై ఉండటం విశేషమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌కున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. రజనీకాంత్ మద్దతు రాజకీయంగా ఎంతో ప్రభావాన్ని చూపుతాయ‌న‌డంలో సందేహం లేదు.

విజయ్ పాలనపై రజనీకాంత్ సంతృప్తి వ్యక్తం చేయడంతో తటస్థ ఓటర్లలో, అభిమానుల్లో విజయ్ పట్ల మరింత సానుకూలత పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఇద్దరు దిగ్గజాల మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. విజయ్ - రజనీకాంత్ మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ సంభాషణ తమిళనాడులో ఓ కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోంది. విమర్శల కంటే పరస్పర సహకారం , గౌరవంతో ముందుకు సాగడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. రజనీకాంత్ తన అనుభవంతో ఇచ్చిన సలహాలు, విజయ్ తన ఉత్సాహంతో చేస్తున్న పనులు కలిసి తమిళనాట ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.