విజయ్ చిన్ననాటి ఫోటోలు చూశారా..భలే వున్నాడే!
గత నాలుగు రోజులుగా కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు అంటూ ఎక్కడ చూసినా విజయ్ దళపతి పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
By: Madhu Reddy | 7 May 2026 10:30 AM ISTగత నాలుగు రోజులుగా కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు అంటూ ఎక్కడ చూసినా విజయ్ దళపతి పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొదటి ప్రయత్నంలోనే 234 సీట్లకు గానూ 108 సీట్లను కైవసం చేసుకుని ..అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. టీవీకే పార్టీ ద్వారా తన సత్తా ఏంటో నిరూపించి.. అటు సినిమాల ద్వారా ఆడియన్స్ లో.. ఇటు సీట్ల ద్వారా ప్రజలలో తనకు ఎంత అభిమానం ఉందో నిరూపించారు విజయ్ దళపతి. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన త్వరలో బలబలాలు నిరూపించుకొని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా ఆయన అభిమానులు విజయ్ ను ఎప్పుడూ చూడని కొన్ని రేర్ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలాంటి వాటిలో విజయ్ చిన్నప్పుడు తన తోటి స్నేహితులతో క్లాస్ రూమ్ గదిలో దిగిన ఫోటోలను మొదలుకొని.. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు అలాగే కాలేజ్ టైంలో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఆయనను మరింత వైరల్ చేస్తున్నారు.. అందులో భాగంగానే తాజాగా విజయ్ కి సంబంధించిన ఈ రేర్ ఫోటోలు సినిమా లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజాగా వైరల్ అయిన ఫోటోలలో విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఒక పెళ్లి భోజనంలో దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. అలాగే కాలేజ్ టైంలో తన స్నేహితులతో రూమ్ షేరింగ్ సమయంలో తీసుకున్న మధుర జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షించాయి.. అంతేకాదు విజయ్ స్కూలింగ్ చదువుతున్న సమయంలో బంధువుల పెళ్ళిలో తీసుకున్న ఫోటోలతో పాటూ చిన్ననాటి తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మొత్తానికైతే విజయ్ ను మునుపెన్నడూ చూడని ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో విజయ్ లో అప్పటికి ఇప్పటికీ ఏం తేడా లేదు. ముఖ్యంగా రూపంలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే విజయ్ కి సంబంధించిన ఈ రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక విజయ్ విషయానికి వస్తే చెన్నైలోని కోడంబాక్కంలోని ఫాతిమా హైయర్ సెకండరీ స్కూల్లో అలాగే బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇక లయోలా కాలేజ్ నుండి విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు విజయ్. విజయ్ ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్,నేపద్యగాయకురాలు శోభ చంద్రశేఖర్ దంపతుల ఏకైక కుమారుడు. వీరికి కూతురు కూడా ఉంది కానీ ఆమె చిన్నతనంలోనే మరణించింది. విజయ్ కి సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రాంత్, విరాజ్ లు కజిన్స్ కావడం గమనార్హం.
