Begin typing your search above and press return to search.

గర్ల్‌ఫ్రెండ్ కోసం విజయ్ ఇలా..

అయితే, సినిమా ప్రమోషన్ల కంటే ఎక్కువగా రష్మిక వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్‌షిప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

By:  M Prashanth   |   7 Nov 2025 10:37 AM IST
గర్ల్‌ఫ్రెండ్ కోసం విజయ్ ఇలా..
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈరోజు (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, సినిమా ప్రమోషన్ల కంటే ఎక్కువగా రష్మిక వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్‌షిప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. అయినా సరే, ఈ జంట మాత్రం ఈ రూమర్లపై ఎక్కడా స్పందించలేదు. 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రమోషన్లలో కూడా రష్మిక ఈ ప్రస్తావన రాకుండా చాలా జాగ్రత్తపడింది. దీంతో ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడా అని ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.

అందరి అంచనాలకు తెరదించుతూ, సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. 'ది గర్ల్‌ఫ్రెండ్' టీమ్‌ను అభినందిస్తూ ట్విట్టర్ (X) వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టాడు. సినిమా ట్రైలర్‌ను షేర్ చేస్తూ తనదైన శైలిలో విషెస్ తెలిపాడు. "వాళ్ళు ఏదో పవర్‌ఫుల్ విషయం చెప్పారని నాకు తెలుసు. అది చాలా ముఖ్యమైనది, జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండేది" అని విజయ్ పేర్కొన్నాడు.

నటీనటులందరి పెర్ఫార్మెన్స్ టాప్ క్లాస్‌లో ఉంటుందని తనకు తెలుసంటూ టీమ్‌ను ఆకాశానికెత్తాడు. ఇది కేవలం రష్మికకు మాత్రమే కాకుండా, మొత్తం టీమ్‌కు ఇస్తున్న సపోర్ట్‌లా కనిపించింది. "రష్మిక, దర్శకుడు రాహుల్, దీక్షిత, అను ఇమ్మాన్యుయేల్ కలిసి క్రియేట్ చేసింది పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోంది" అని విజయ్ రాసుకొచ్చాడు.

"రేపు మనమందరం దీన్ని థియేటర్లలో చూసి, అనుభూతి చెంది, ఆలోచిద్దాం. మొత్తం టీమ్‌కి నా లవ్, బిగ్ హగ్స్" అంటూ చాలా ప్రొఫెషనల్‌గా పోస్ట్ ముగించాడు. విజయ్ కేవలం రష్మికను విష్ చేస్తాడా లేక సినిమా గురించి మాట్లాడతాడా అని ఎదురుచూసిన వారికి, ఆయన చాలా బ్యాలెన్స్ డ్ గా, సినిమా కంటెంట్‌ను హైలైట్ చేస్తూ ఇచ్చిన ఈ లాస్ట్ మినిట్ సపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్ సినిమాకు చివరి నిమిషంలో మంచి బూస్ట్ ఇచ్చిందనడంలో సందేహం లేదు.