దళపతి, సేతుపతి మధ్య కంపేరిజన్.. గణేష్ హై ఎలివేషన్!
"నేను దళపతి విజయ్ తో దాదాపు 42 రోజుల పాటు పనిచేశా. ఆయన వర్క్ పట్ల చూపించే డెడికేషన్ మామూలుగా ఉండదు.
By: M Prashanth | 9 Jun 2026 2:00 PM ISTఒక యాక్టర్ టాలెంట్ ను అభిమానులు పొగడటం సహజమే. కానీ అతనితో కలిసి పనిచేసిన యాక్టర్.. మరో స్టార్ హీరోతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తే ఆ కామెంట్స్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ వస్తుంది. తాజాగా నటుడు వీటీవీ గణేష్ కూడా అలాంటి కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. దళపతి విజయ్ తర్వాత అదే రేంజ్ డెడికేషన్, డిసిప్లైన్, తాను విజయ్ సేతుపతిలో చూశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా జరగ్గా.. ఆ కార్యక్రమంలో వీటీవీ గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఆయన.. సెట్స్ లో దగ్గరగా గమనించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అవే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
"నేను దళపతి విజయ్ తో దాదాపు 42 రోజుల పాటు పనిచేశా. ఆయన వర్క్ పట్ల చూపించే డెడికేషన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే విషయాన్ని విజయ్ సేతుపతిలో కూడా చూస్తున్నా. అందుకే ఆయన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు" అని గణేష్ తెలిపారు. విజయ్ సేతుపతి ప్రతి సీన్ ను ఎంతో శ్రద్ధగా అబ్జర్వ్ చేస్తారని చెప్పారు. కేవలం డైలాగ్స్ చెప్పడం మాత్రమే కాదు.. రోల్ కు తగ్గ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలనే విషయాలపై ప్రత్యేక దృష్టి పెడతారని తెలిపారు.
ఒక సీన్ ను మరింత ఎఫెక్టివ్ గా మార్చేందుకు ఆయన ఎప్పుడూ ట్రై చేస్తుంటారని ప్రశంసలు కురిపించారు. షూటింగ్ సమయంలో తనకు కూడా విజయ్ సేతుపతి పలు సూచనలు చేసేవారని గణేష్ వెల్లడించారు. "డైలాగ్స్ పై మాత్రమే కాకుండా సీన్ మూడ్ పై కూడా ఫోకస్ పెట్టాలి" అని చెప్పేవారని, స్క్రీన్ పై నేచురాలిటీ కనిపించేలా చూసే యాక్టర్ విజయ్ సేతుపతి అని అన్నారు.
అంతేకాదు, సెట్స్ లో ఆయన ఎంతో సరదాగా ఉంటారని, క్యాస్టింగ్ తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని చెప్పారు. విజయ్ సేతుపతి తనను ఎంతో అభిమానిస్తారని, అందుకే ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. ఇక స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ విషయానికి వస్తే.. పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ అంధుడైన బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ మూవీలో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఆ సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో సినిమా కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది వీటీవీ గణేష్ కంపేరిజన్ అని చెప్పాలి. దళపతి తర్వాత అదే రేంజ్ కమిట్మెంట్ ఉన్న నటుడు సేతుపతి అని చెబుతూ ఎలివేషన్ ఇవ్వడం వైరల్ గా మారింది.
