Begin typing your search above and press return to search.

లీడ్ సినిమాలపై ప్రభావం.. అందుకే కేమియోలకు నో అన్న సేతుపతి!

అసలు తానెందుకు క్యామియోలకు దూరంగా ఉంటున్నారో లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఆసక్తికర వివరాలేంటో చూద్దాం..

By:  Madhu Reddy   |   3 Aug 2026 3:20 PM IST
లీడ్ సినిమాలపై ప్రభావం.. అందుకే కేమియోలకు నో అన్న సేతుపతి!
X

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనగానే ఆయన విలక్షణమైన నటన గుర్తుకొస్తుంది. హీరోగా, విలన్‌గా మెప్పిస్తూనే, గతంలో ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఆశ్చర్యపరిచారు. అయితే ఇకపై తానెలాంటి అతిథి పాత్రలు చేయబోనని ఆయన ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేశానని చెబుతూ.. అసలు తానెందుకు క్యామియోలకు దూరంగా ఉంటున్నారో లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఆసక్తికర వివరాలేంటో చూద్దాం..

తలైవర్ కోసం రూల్ బ్రేక్ చేసిన సేతుపతి:

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న క్రేజీ సీక్వెల్ 'జైలర్ 2'. దసరా కానుకగా రాబోతున్న ఈ భారీ అంచనాల సినిమాలో విజయ్ సేతుపతి ఒక స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన 'పేట' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు మళ్లీ తలైవర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో, తాను ఎప్పుడో వదిలేసిన క్యామియో రోల్స్‌ని ఈ ఒక్క సినిమా కోసం మినహాయింపుగా చేస్తున్నట్లు సేతుపతి కన్ఫామ్ చేశారు.

నా ఇమేజ్‌తో వాళ్ల మార్కెటింగ్:

ఇక గెస్ట్ రోల్స్ ఎందుకు మానేశారనే దానికి ఆయన చాలా ప్రాక్టికల్ ఆన్సర్ ఇచ్చారు. "ఇతర సినిమాల్లో నేను కేవలం చిన్న అతిథి పాత్ర చేసినా సరే, నా ఇమేజ్ వాడుకుంటూ పోస్టర్ల మీద నా ఫొటో పెద్దగా వేస్తున్నారు. నన్ను కేవలం మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నారు. ఇక దీని వల్ల ఆ సినిమాకి ప్రమోషన్ దక్కుతోంది కానీ, నేను ఫుల్ టైమ్ హీరోగా కష్టపడి చేస్తున్న నా సొంత సినిమాల మార్కెట్‌పై, ప్రేక్షకుల దృష్టిపై ఆ ప్రభావం నెగెటివ్‌గా పడుతోంది. అందుకే ఇక క్యామియోలు చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాను" అని స్పష్టం చేశారు.

రజనీ ముందు నా ఫొటో చూస్తారా?:

మరి 'జైలర్ 2'కి ఈ మార్కెటింగ్ ప్రాబ్లమ్ రాదా అని అడిగితే.. సేతుపతి నవ్వుతూ ఎంతో వినయంగా బదులిచ్చారు. "పోస్టర్ మీద రజనీకాంత్ గారితో పాటు నా ఫొటో ఎంత పెద్దగా ఉన్నా సరే, జనాలు రజనీ గారినే చూస్తారు కానీ నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇక ప్రేక్షకుల ఫోకస్ అంతా కచ్చితంగా ఆయన మీదే ఉంటుంది. కాబట్టి నా లీడ్ సినిమాల ఇమేజ్‌కి ప్రభావం పడుతుంది. అని సమాధానం ఇచ్చారు.

ఫ్యాన్స్ ఫిదా.. దసరాకు జాతరే:

రజనీకాంత్ మీద ఉన్న అపారమైన గౌరవంతో తన సొంత రూల్స్ కూడా పక్కన పెట్టిన విజయ్ సేతుపతిని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన సినిమాల మార్కెట్ గురించి ఆయన చెప్పిన రీజన్ కూడా నూటికి నూరు పాళ్లు కరెక్ట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక మరి 'జైలర్ 2'లో ఈ క్రేజీ కాంబో మరోసారి థియేటర్లలో ఎలాంటి మాస్ జాతర సృష్టిస్తుందో చూడాలంటే దసరా పండుగ వరకు వెయిట్ చేయాల్సిందే..