విజయ్ గొప్ప నిర్ణయం.. ధ్రువ్ మాటలు వర్క్ అవుట్ అవుతున్నాయే!
అందులో భాగంగానే మొదటి వ్యక్తి హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
By: Madhu Reddy | 4 Nov 2025 9:28 AM ISTసినీ ఇండస్ట్రీలో నెపోకిడ్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. బయట చూసేవారు మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి.. త్వరగా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు అంటూ ఇటీవలే నెపోకిడ్ జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి మొదటి సినిమా ఎంట్రీకి మాత్రమే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పనికొస్తుందని.. ఆ తర్వాత మనమే అవకాశాలు వెతుక్కోవాలి అని అటు హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా చెప్పుకొచ్చింది.
అయితే ఆ మొదటి సినిమా అవకాశం కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా సొంత టాలెంట్ తో దక్కించుకోవాలి అని పలువురు స్టార్ కిడ్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటి వ్యక్తి హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన తండ్రి విక్రం చియాన్ హీరోగా వచ్చిన ఆదిత్య వర్మ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత మళ్లీ తన తండ్రి హీరోగా నటించిన మహాన్ అనే సినిమాలో కూడా నటించారు. కానీ బైసన్ సినిమాతో హీరోగా తన టాలెంట్ ను నిరూపించుకొని.. మంచి సక్సెస్ అందుకున్నారు. ముఖ్యంగా ఎవరి సపోర్టు లేకుండా సొంతంగా కథలు విని ఆ కథలతో సక్సెస్ అందుకోవాలి అని ధ్రువ్ ఎప్పటినుంచో అనుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే బైసన్ సినిమా విషయంలో తన తండ్రి ప్రమేయం లేకుండా ఆయనే కష్టపడి మరీ సినిమాను ఫైనలైజ్ చేసి ఇప్పుడు ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఇప్పుడు ఈయన మాటలు వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ సేతుపతి తన కొడుకు మొదటి సినిమా విషయంలో జోక్యం చేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ సేతుపతి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య ఫీనిక్స్ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నవంబర్ 7వ తేదీన ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన విజయ్ సేతుపతి మాట్లాడుతూ.." సూర్య సినిమా విషయంలో నేను అస్సలు జోక్యం చేసుకోను. డైరెక్టర్ అనల్ అరుసు జవాన్ సినిమా సమయంలోనే ఈ కథ చెప్పారు. దాంతో మా అబ్బాయి హీరో అవ్వాలనుకుంటున్నాడు.. వాడు మీరు మాట్లాడుకోండి అని మాత్రమే చెప్పాను. అప్పటి నుంచి ఈ సినిమా విషయంలో ఎక్కడ కూడా నేను జోక్యం చేసుకోలేదు. కానీ ఫైనల్ గా సినిమా చూపించారు. నచ్చింది. తెలుగు ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను" అంటూ విజయ సేతుపతి తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు విజయ్ సేతుపతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ధ్రువ్ మాటలను ఏకీభవిస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది.. సెలబ్రిటీలందరూ కూడా తమ పిల్లల విషయంలో ఇదే ఫాలో అయితే వారికంటూ కష్టం విలువ తెలిసి ఇండస్ట్రీలో త్వరగానే నిలదొక్కుకుంటారు అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ పద్ధతిని ఇంకెంత మంది సెలబ్రిటీలు ఫాలో అవుతారో చూడాలి.
