Begin typing your search above and press return to search.

మక్కల్ సెల్వన్ కోసం పూరీ పర్ఫెక్ట్ స్కెచ్..!

మక్కల్ సెల్వన్ తో పూరీ చేస్తున్న సినిమాతో అది కచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు. విజయ్ సేతుపతి, పూరీ కాంబో సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినిపించాయి.

By:  Ramesh Boddu   |   9 Oct 2025 11:34 AM IST
మక్కల్ సెల్వన్ కోసం పూరీ పర్ఫెక్ట్ స్కెచ్..!
X

పూరీ జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఒక సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. అవతల ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కథ నచ్చితేనే సినిమా చేస్తాడు విజయ్ సేతుపతి. అలాంటి విజయ్ సేతుపతికి ఒప్పించాడంటే ఈసారి పూరీ గట్టి ప్లాన్ తోనే వస్తాడని అనుకుంటున్నారు. పూరీ కూడా తన స్టామినా ఏంటో తెలిసినా కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడాన్ని గుర్తించాడు. అందుకే పూరీ ఈసారి తన పాత పంథా కొనసాగించాలని చూస్తున్నాడు. ఒకసారి ఒకప్పటి పూరీని తీసుకొస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

విజయ్ సేతుపతి, పూరీ కాంబో..

మక్కల్ సెల్వన్ తో పూరీ చేస్తున్న సినిమాతో అది కచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు. విజయ్ సేతుపతి, పూరీ కాంబో సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా స్లమ్ డాగ్ అనే పేరు ఫిక్స్ చేశారన్న టాక్ నడిచింది. ఐతే సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సినీ ప్రియులను సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ ని లాక్ చేశారట. పూరీ, ఛార్మీ కలిసి హర్షవర్ధన్ తో దిగిన ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

యానిమల్ సినిమాతో బిజిఎం కి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు హర్షవర్ధన్. సందీప్ వంగాతో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు హర్షవర్ధన్. ఐతే నెక్స్ట్ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాకు కూడా హర్షవర్ధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో సందీప్ తో పాటు పూరీ జగన్నాథ్ కూడా హర్షవర్ధన్ టాలెంట్ ని యూజ్ చేసుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ తొలి సినిమా నుంచి మ్యూజిక్ విషయంలో ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తూ వచ్చాడు.

మ్యూజిక్ పరంగా ది బెస్ట్ అనిపించేలా..

విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమాతో మరోసారి తన సినిమా మ్యూజిక్ పరంగా ది బెస్ట్ అనిపించేలా చేస్తున్నారు. ముఖ్యంగా బిజిఎం విషయంలో హర్షవర్ధన్ బెస్ట్ ఇస్తాడని నమ్మి అతన్ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి సినిమా కోసం పూరీ పర్ఫెక్ట్ స్కెచ్ తోనే రంగంలోకి దిగాడని అనిపిస్తుంది. సినిమా నుంచి ఏదైనా ఫస్ట్ లుక్ టీజర్ వస్తేనే పూరీ మళ్లీ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది క్లారిటీ వస్తుంది.

పూరీ జగన్నాథ్ ఫాం లోకి వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు వస్తాయని చెప్పొచ్చు. ఈమధ్య విజయ్ సేతుపతి అటెంప్ట్ చేస్తున్న సినిమాలన్నీ వర్క్ అవుట్ అవుతున్నాయి. పూరీతో ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.