బెగ్గర్, స్లమ్ డాగ్ లో ఒకటి గ్యారెంటీ!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 29 Sept 2025 10:23 AM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఎలాంటి సెట్లు వే యకుండా రియల్ లోకేషన్స్ లో నే పూరి షూటింగ్ నిర్వహిస్తున్నారు. చూస్తుంటే బడ్జెట్ లోనే షూటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పూరి సినిమాలంటే పెద్దగా సెట్లు వేయరు. అవసరమైతే పాటలకు తప్ప సీన్స్ కోసం సెట్లు వేసే దర్శకుడు కాదు పూరి. సేతుపతి సినిమా కోసం ఎలాంటి సెట్లు వేసినట్లు ప్రచారంలో లేదు.
స్టోరీకి పక్కా యాప్ట్ టైటిల్స్:
అలాగే విదేశాల్లోనూ షూటింగ్ చేయడం లేదు. దాదాపు షూటింగ్ అంతా భారత్ లోనే వివిధ లొకేషన్స్ లో జరుగు తోంది. సినిమాలో విజయ్ సేతుపతి డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి ఇమేజ్ కు తగ్గ స్క్రిప్ట్ డిజైన్ చేసి పట్టాలెక్కించిన ప్రాజెక్ట్ గా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు `బెగ్గర్`, `స్లమ్ డాగ్` అంటూ రెండు టైటిల్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. పూరి రాసిన కథ రెండు టైటిల్స్ కు చాలా దగ్గరగా ఉందని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇది నిజమేనని పూరి కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది.
సక్సెస్ ఒక్కటే ఆప్షన్:
ఈ రెండు టైటిల్స్ లో పూరి ఒక టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని కేవ్ వర్గాల నుంచి తెలిసింది. పూరి కథ రాసే ముందే టైటిల్ నిర్ణయిస్తారు. ఇది ఆయన ప్రత్యేకత. కెరీర్ ఆరంభం నుంచి ఇదే విధానంలో పూరి కథలు పుట్టాయి. అలా ఈ రెండు టైటిల్స్ అనుకునే ఈసినిమా కథ రాయడం మొదలు పెట్టారుట. అయితే ఈ కథను మాత్రం బ్యాంకాక్ బీచ్ లో కాకుండా ఓ రూమ్ లో కూర్చుని రాసినట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. పూరి కిప్పుడు ఉన్న పళంగా సక్సెస్ అవసరం అన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో పరిస్థితి దారుణంగా ఉంది.
కసిగా పని చేస్తోన్న పూరి:
ఈ సినిమాతో హిట్ కొడితేనే లేదంటే ఇండస్ట్రీలో మనుగడ కూడా కష్టమే. దర్శకుల మధ్య కాంపిటీషన్ మామూ లుగా లేదు. పాన్ ఇండియా కంటెంట్ అంటూ నవతరం దూసుకొస్తుంది. వాళ్లను అందుకోవాలంటే? పూరి హిట్ కొట్టాలి. పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాలి. విజయ్ సేతుపతి సినిమాతో అది సాధించాలని కసి తో పని చేస్తున్నాడు. బయట నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వచ్చినా? తన బ్యానర్లో హిట్ కొట్టిన తర్వాతే మళ్లీ బయటకు వెళ్లేదని శబదంతో ముందుకెళ్తున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి.
