Begin typing your search above and press return to search.

పూరి- సేతుప‌తి కూడా చెక్కుతున్నారా?

రెండు..మూడు నెల‌ల్లోనూ షూటింగ్ పూర్తిచేసి సినిమా రిలీజ్ చేయ‌డం అన్న‌ది పూరి జ‌గ‌న్నాధ్ స్టైల్. కానీ వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో `ఇస్మార్ట్ శంక‌ర్` నుంచి స్టైల్ మార్చారు.

By:  Srikanth Kontham   |   13 Jan 2026 8:00 AM IST
పూరి- సేతుప‌తి కూడా చెక్కుతున్నారా?
X

రెండు..మూడు నెల‌ల్లోనూ షూటింగ్ పూర్తిచేసి సినిమా రిలీజ్ చేయ‌డం అన్న‌ది పూరి జ‌గ‌న్నాధ్ స్టైల్. కానీ వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో `ఇస్మార్ట్ శంక‌ర్` నుంచి స్టైల్ మార్చారు. కొంత మంది సీనియ‌ర్ రైట‌ర్లు స‌హా, ఆయ‌న స‌తీమ‌ణి ఇచ్చిన స‌ల‌హా మేర‌కు షూటింగ్ నెమ్మ‌దిగా పూర్తి చేస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` రెండు చిత్రాలు అలా చేసినవే. కానీ ఫ‌లితం మాత్రం పెద్ద‌గా మార్పులేదు. `ఇస్మార్ట్ శంక‌ర్` హిట్ అయినా? `డ‌బ్బుల్ ఇస్మార్ట్` డిజాస్ట‌ర్ అయింది. మ‌రి ఇక్క‌డ పూరి స‌క్సెస్ అయిన‌ట్లే? ఫెయిలైనట్లా? స‌క్సెస్ కంటే ఫెయిలే హైలైట్ అవుతుంది.

షూటింగ్ వేగంగా పూర్తి చేయ‌గల్గితే షూటింగ్ ఖ‌ర్చు త‌గ్గుతుంది. షూటింగ్ డేస్ క‌లిసొస్తాయి. దీంతో చాలా వ‌ర‌కూ ఖ‌ర్చు త‌గ్గించొచ్చు. పూరి సినిమాలంటే పెద్ద‌గా బ‌డ్జెట్ కూడా ఉండ‌వు. అవ‌స‌ర‌మైతే పాట‌ల‌కు సెట్స్ వేస్తాడు. లేదంటే వాటిని కూడా ఔట్ డోర్ లో పూర్తి చేయ‌డం పూరికి అల‌వాటైన ప‌నే. మ‌రి పూరి -విజ‌య్ సేతుప‌తి సినిమా సంగ‌తేం టి? అంటే ఈ చిత్రాన్ని కూడా పూరి చెక్కుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఈ సినిమా సెట్స్ కు వెళ్లి కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదారు నెల‌లైనా అవ్వొచ్చు. కానీ షూటింగ్ ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు.

పూరి సినిమా సెట్స్ లో ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ఉండ‌టం కూడా ఇదే తొలిసారి. ఇంత వ‌ర‌కూ ఏ సినిమాకు ఇలా జ‌ర‌గ‌లేదు. ఎప్ప‌టి క‌ప్పుడు షూటింగ్ అప్ డేట్ ఇచ్చేవారు. కానీ సేతుప‌తి సినిమా విష‌యంలో పూరి సైతం అంతే గోప్య‌త వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాదిలోనే ఈసినిమా రిలీజ్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ రిలీజ్ కాదు క‌దా? క‌నీసం అప్ డేట్ కూడా లేదు. న‌టీనటుల పుట్టిన రోజు వేడుక‌లు సంద‌ర్భం గానైనా అప్ డేట్ ఇవ్వ‌డం లేదా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనైనా సంద‌డి చేయ‌డం ఈ మ‌ద్య కాలంలో అన‌వాయితీగా కొన‌సాగుతుంది.

క్రిస్మ‌స్ అయిపోయింది. న్యూ ఇయ‌ర్ వెళ్లిపోయింది. సంక్రాంతి కూడా వ‌చ్చేసింది. కానీ పూరి అలాంటి వాటిని కూడా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. పండ‌గ సంద‌ర్భంగా ఏదైనా అప్ డేట్ కి అవ‌కాశం ఉందా అంటే? ఈపాటికే ఏదో హింట్ నెట్టింట వైర‌ల్ అయ్యేది. కానీ ఆ స‌న్నివేశం కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి పూరి- సేతుప‌తి క్రేజీ అప్ డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. కొంత కాలంగా పూరి ముంబైలోనే ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. వ‌చ్చినా? ఉండ‌టం లేద‌నే మాట వినిపిస్తోంది.