Begin typing your search above and press return to search.

త‌మిళ స్టార్ హీరో ఆన్‌లైన్ ల‌వ్‌స్టోరీ!

అలాంటి మ‌లుపులు, ట‌ర్న్‌ల‌తో సాగిన ఓ విల‌క్ష‌ణ న‌టుడి ఓ స్టోరీ ఇది.

By:  Ravindar Gorantla   |   4 March 2026 2:00 PM IST
త‌మిళ స్టార్ హీరో ఆన్‌లైన్ ల‌వ్‌స్టోరీ!
X

వెండితెర‌పై విల‌క్ష‌ణ న‌టులుగా, స్టార్లుగా, స్టార్ హీరోలుగా వెలుగొందుతూ పాపులారిటీని సొంతం చేసుకున్న వారి జీవితాల్లో ఎవ‌రికీ తెలియ‌ని సంఘ‌ట‌న‌లు, మ‌లుపులు, ఆశ్చ‌ర్యపోయే ప్రేమ‌క‌థ‌లు, చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు ఉన్నాయ‌న్న‌ది చాలా కొద్ది మందికే తెలుసు. అలాంటి మ‌లుపులు, ట‌ర్న్‌ల‌తో సాగిన ఓ విల‌క్ష‌ణ న‌టుడి ఓ స్టోరీ ఇది. ఆన్ లైన్ ప్రేమ‌క‌థ ఇది. కోలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న‌ది ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌. ఆర్టిస్ట్‌గా, హీరోగా మార‌డానికి ముందు విజ‌య్ సేతుప‌తి చాలా ప‌నులు చేశాడు.

అకౌంటెంట్‌గా ఇండియాలో వ‌ర్క్ చేస్తే వ‌చ్చే మొత్తం కంటే దుబాయ్‌లో నాలుగు రెట్లు వ‌స్తుంద‌ని భావించి అక్క‌డ అకౌంటెంట్‌గా వ‌ర్క్ చేయ‌డానికి దుబాయ్ వెళ్లాడు. అక్క‌డే మంచి కంప‌నీలో చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. విచిత్రంగా అక్క‌డే ప్రేమ‌లో ప‌డ్డాడు. అయితే త‌న‌ని నేరుగా క‌ల‌వ‌కుండా ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం చేసుకున్నాడు. త‌నే జెస్సీ. ప్ర‌తి రోజు ఫేస్ బుక్ లో మెసేజ్‌లు చేస్తూ ఇద్ద‌రు మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. అయితే విచిత్రం ఏంటంటే ప్రేమించుకోవ‌డం మొద‌లు పెట్టాక ఒక‌రి ఫేస్ ఒక‌రికి తెలియ‌దు.

కానీ ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ ఏర్ప‌డింది. ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా ద‌గ్గ‌రైన సేతుప‌తి, జెస్సీ ఒక‌రిని ఒక‌రు అర్థం చేసుకోవ‌డం, ఒక‌రితో ఒక‌రం క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అదే వీరిని పెళ్లి వ‌ర‌కు న‌డిపించింది. అయితే ఆ పెళ్లి అంత సుభంగా జ‌ర‌గ‌లేద‌ట‌. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల వారు అభ్యంత‌రాలు చెప్ప‌డంతో విజ‌య్ సేతుప‌తి త‌ను ప్రేమించి జెస్సీ కోసం చిన్న పాటి యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింద‌ట‌. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా జెస్సీని వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని విజ‌య్ సేతుప‌తి ఫైన‌ల్‌గా కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించాడ‌ట‌. అంతే కాకుండా వారికున్న అనుమాల్ని కూడా తీర్చ‌డంతో 2003లో ప్రేమ ఫ‌లించి ప్రేమించి జెస్సీని పెళ్లి చేసుకున్నాడు.

ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో షాకింగ్ విష‌యం ఏంటంటే విజ‌య్ సేతుప‌తి త‌ను ప్రాణంగా ప్రేమించిన జెస్సీని నిశ్చితార్థం రోజే ఫైన‌ల్‌గా చూశాడ‌ట‌. ఇరు కుటుంబాలు వీరి ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఫైన‌ల్‌గా ఒక్క‌ట‌య్యారు. వీరికి ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌లు. ఓ బాబు పేరు సూర్య‌. పాప శ్రీ‌జ‌. బాబుకు సూర్య అని పేరు పెట్టడానికి కార‌ణం విజ‌య్ సేతుప‌తికి హీరో సూర్య అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం కార‌ణంగానే త‌న కొడుక్కి సూర్య అనిపేరు పెట్టాడ‌ని ఇటీవ‌ల ఓ పోడ్ కాస్ట్‌లో విజ‌య్ సేతుప‌వి వివ‌రించ‌డం విశేషం.

కోలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా, హీరోగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న విజ‌య్ సేతుప‌తి 1996లో ప్ర‌భుదేవా, న‌గ్మ జంట‌గ న‌టించి `ల‌వ్ బ‌ర్డ్స్‌`తో సినీ ప్ర‌యాణం ప్రారంభించినా త‌న‌కు బ్రేక్ అభించింది మాత్రం `పిజ్జా`తో. అక్క‌డి నుంచి కెరీర్‌లో వెనుదిగిరి చూసుకోని విజ‌య్ సేతుప‌తి హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా విభిన్న‌మైన సినిమాల్లో న‌టిస్తూ విజ‌య‌వంతంగా త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నాడు. త్వ‌ర‌లో పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన `స్లామ్ డాగ్‌` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.