Begin typing your search above and press return to search.

మహారాజ 2.. సీక్వెల్ చిక్కు ఒక్కటే కానీ..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తే అందులో కచ్చితంగా విషయం ఉంటుందని చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి.

By:  Ramesh Boddu   |   18 Jan 2026 8:00 PM IST
మహారాజ 2.. సీక్వెల్ చిక్కు ఒక్కటే కానీ..?
X

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తే అందులో కచ్చితంగా విషయం ఉంటుందని చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి. వాటిల్లో మహారాజ కూడా ఒకటి. నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గానే కాదు ఎమోషనల్ గా సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అసలు ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. విజయ్ సేతుపతి కథా సెలక్షన్ పై మరింత కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసింది ఈ మూవీ.

సీక్వెల్స్ క్లిక్ అవుతుంటే మరికొన్ని మాత్రం..

ఐతే ఈమధ్య ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు దానికి అవసరం ఉన్నా లేకపోయినా సీక్వెల్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు సీక్వెల్స్ క్లిక్ అవుతుంటే మరికొన్ని మాత్రం అసలు ఆడట్లేదు. అంతేకాదు ఒకసారి ఆల్రెడీ చూసేసిన క్యారెక్టర్స్ ని మరో కథలో చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ సీక్వెల్ కథ బాగా కుదిరితే తప్ప ఇది వర్క్ అవుట్ అవ్వదు.

ముఖ్యంగా ఫస్ట్ సినిమా కన్నా ఏదైనా సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అంటే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటున్నాయి. అందుకే ఈ సీక్వెల్ సినిమాల మీద ఆడియన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ తో ఉన్నారు. ఐతే మహారాజ సినిమాకు సీక్వెల్ కథ ఆల్రెడీ నిథిలన్ రాసుకున్నాడట. విజయ్ సేతుపతి కూడా లైన్ బాగుందని నెక్స్ట్ పూర్తి స్క్రిప్ట్ తో వచ్చి కలవమని చెప్పాడట.

మహారాజ సీక్వెల్ సినిమా అనగానే..

సో మహారాజ సీక్వెల్ కథ దాదాపు లాక్ అయినట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక నిధిలన్ మూవీ ఉంటుంది. మహారాజ సీక్వెల్ సినిమా అనగానే ఆడియన్స్ లో ఒక ఆసక్తి మొదలైంది. తప్పకుండా ఈ సినిమా మరోసారి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

మహారాజ 2 సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి తన మార్క్ చాటబోతున్నాడు. పూరీ సినిమా వెంటనే ఈ సీక్వెల్ వస్తే కెరీర్ పరంగా విజయ్ కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈమధ్య విలన్ పాత్రలను వదిలి సోలో సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న విజయ్ సేతుపతి పూరీ సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగులో విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉప్పెనలో శేషారాయణం పాత్రలో అదరగొట్టిన విజయ్ సేతుపతి రాబోతున్న పూరీ సినిమాతో స్ట్రైట్ తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇక మహారాజ 2 సినిమాపై కూడా ఆడియన్స్ క్రేజ్ చూస్తుంటే ఈ సీక్వెల్ కూడా విజయ్ స్టామినా ప్రూవ్ చేసేలా ఉందని చెప్పొచ్చు.