కూలి పనుల నుంచి సూపర్ స్టార్ వరకూ!
ఒకానొక దశలో కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికిన ఆయన జీవితం.. నేడు సూపర్‌స్టార్ స్థాయికి చేరడం వెనుక ఉన్నది ఎంతో కష్టం ఉంది.
By: Srikanth Kontham | 18 July 2026 8:30 AM ISTసినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన నటుల్లో విజయ్ సేతుపతి ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. సాధా రణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ప్రతిభతోనే మక్కల్ సెల్వన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కథ, కలలు కనే ప్రతి సామాన్యుడికి ఆదర్శం. డబ్బు సంపాదించాలని చెన్నైకి వచ్చిన ఆయన మొదట్లో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో. ఒకానొక దశలో కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికిన ఆయన జీవితం.. నేడు సూపర్‌స్టార్ స్థాయికి చేరడం వెనుక ఉన్నది ఎంతో కష్టం ఉంది.
విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో అకౌంటెంట్‌గా, సేల్స్ మెన్‌గా, చివరికి కూలీ పనులతో సహా అనేక చిన్న పనులు చేశారు. నటుడిగా అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఎన్నో సార్లు తిరస్కరణలను ఎదుర్కొన్నారు. నీకు నటన రాదు పక్కకు తప్పుకో అని ఎంతో మంది అవమానించారు. కానీ అవేవీ ఆయన్ని కుంగదీయలేదు. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని నటనకు పాఠంగా భావించి పదును పెట్టుకున్నారు. ఒక నటుడిగా తనను తాను నిరూపిం చుకోవడానికి ఆయన పడ్డ తపన, కళ్లలో కనిపించే నిజాయితీని బయటకు తీసింది.
విజయ్ సేతుపతిలో సహజత్వం, సాధారణ మనిషిలా కనిపించే నటననే ఆయనకు అతిపెద్ద బలాలుగా మారాయి. గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక శైలిని రూపొందించు కున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా? విలన్ పాత్రల్లోనూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఆయనకు ఉన్న క్రేజ్ ఆయన కృషికి నిదర్శనం. ప్రతి పాత్రలోనూ ఒదిగిపోవడం విజయ్ సేతుపతి ప్రత్యేకత.
`పిజ్జా`, `నడువుల కొంచెం పక్కాత్ కానోమ్` వంటి సినిమాలతో మొదలైన విజయ్ విజయ ప్రస్థానం `96`, `విక్రమ్`, `మహారాజా` వంటి చిత్రాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. గెటప్పులతో సంబంధం లేకుండా పాత్ర ఏదైనా సరే? అందులో జీవించే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. స్టార్ ఇమేజ్ ఉన్నా ? ఎంతో నిరాడంబరంగా ఉండటం వల్లనే ఆయనకు మక్కల్ సెల్వన్ (ప్రజల మనిషి) అనే పేరు సార్థకమైంది. కూలీగా పనిచేసిన రోజులను ఎప్పుడూ మర్చిపోని ఆయన మనస్తత్వమే అందరివాడిగా నిలబెట్టింది.
ఈ ప్రయాణంలో విజయ్ నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం ఓర్పు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది రాత్రి లో జరిగేది కాదని అది నిరంతర శ్రమ అని నిరూపించారు. విజయ్ సేతుపతి జీవితం నేటి యువతకు ఇచ్చే సందేశం ఏమిటంటే? పరిస్థితులు ఎలా ఉన్నా మీపై మీరు నమ్మకం ఉంచితే అసాధ్యమైనది ఏదీ లేదని. నేడు విజయ్ నటిస్తున్న సినిమాల కోసం దేశవ్యాప్త సినీ ప్రియులు వేచి చూస్తున్నారంటే? ఆయన సంపాదించుకున్న కీర్తి అంత సామాన్యమైనది కాదు.
కూలీ నుంచి సూపర్‌స్టార్ వరకు విజయ్ సేతుపతి ప్రయాణం సినిమాల పరంగానే కాకుండా మానవ విలువల పరంగా కూడా గొప్పది. తన మూలాలను మర్చిపోకుండా? కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. కళను ఆరాధించే వారికి, నిజాయితీగా పని చేసే వారికి విజయం ఎప్పుడూ వెంటే ఉంటుందని ఆయన జీవితం నిరూపిస్తోంది. విజయ్ సేతుపతి వంటి నటులు ఉన్నంతకాలం మంచి కథలకు, అద్భుతమైన నటనకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.
