Begin typing your search above and press return to search.

పూరీనే రిస్క్ అంటే మళ్లీ ఆయనతో కూడానా..?

కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ కి ఆయన ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో ఫిక్స్ చేసుకున్నాడు

By:  Ramesh Boddu   |   19 Sept 2025 7:00 PM IST
పూరీనే రిస్క్ అంటే మళ్లీ ఆయనతో కూడానా..?
X

కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ కి ఆయన ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో ఫిక్స్ చేసుకున్నాడు. అది తెలిసిన ఫ్యాన్స్ అయ్యో ఆయనతో సినిమా ఎందుకు బాసు అని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఈమధ్యనే తలైవన్ తలైవి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ట్రైన్ అనే సినిమా సెట్స్ మీద ఉంది. అదే కాదు పూరీ జగన్నాథ్ తో విజయ్ సేతుపతి సినిమా కూడా లైన్ లో ఉంది.

అసలేమాత్రం ఫాం లో లేని పూరీ..

తెలూ స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ తో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నాడని తెలిసి ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే పూరీ స్టార్ డైరెక్టరే కానీ అసలేమాత్రం ఫాం లో లేడు. ఆయన ఈమధ్య చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. అయినా కూడా పూరీ కథ నచ్చి విజయ్ సేతుపతి ఓకే చేశాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బెగ్గర్ గా చేస్తాడని టాక్. సినిమా టైటిల్ కూడా అదే పెట్టే ఆలోచనలో ఉన్నారట.

పూరీతో సినిమానే రిస్క్ అని అనుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా మరో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. అతనే సిరుత్తై శివ. సూర్యతో కంగువ లాంటి భారీ సినిమా తీసిన శివ ఆ సినిమాను ఆడియన్స్ కి రీచ్ చేయలేకపోయాడు. భారీ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో భారీ లాస్ జరిగింది.

కంగువ తర్వాత అజిత్ తో సినిమా..

కంగువ తర్వాత అజిత్ తో సినిమా చేయాలని అనుకున్నా కూడా ఆ సినిమా రిజల్ట్ చూసి ఆగిపోయారు. అలాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని విజయ్ సేతుపతి మీద ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నారు. ఐతే కెరీర్ మొదట్లో మంచి సినిమాలు తీసిన శివ ఆ తర్వాత ఫాం కోల్పోయాడు. ఐతే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ లోనే మరికొందరు మాత్రం ఆయన సినిమా ఓకే చేశాడంటే మాత్రం సంథింగ్ స్పెషల్ ఉంటుందని అనుకుంటున్నారు.

విజయ్ సేతుపతికి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఒక తమిళ నటుడే అయినా కూడా తెలుగులో ఆయనకు స్టార్ క్రేజ్ ఉంది. తెలుగులో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి చేసిన శేషారాయణం పాత్ర సూపర్ క్లిక్ అయ్యింది. ఐతే ఆ తర్వాత తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చినా కూడా విజయ్ సేతుపతి చేయనని అన్నాడు.