దళపతి ఆస్తులు అమ్మేస్తున్నారా? నిజమెంత?
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఆస్తుల గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 18 March 2026 9:58 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఆస్తుల గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో ఉన్న తన విలువైన ఆస్తులను విక్రయిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ప్రముఖ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఇప్పటికే అన్నా నగర్ లో ఉన్న ఓ బిగ్ ప్రాపర్టీని సుమారు రూ.35 కోట్లకు విక్రయించినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఆ డీల్ గత ఏడాది నుంచి చర్చల్లో ఉన్నప్పటికీ, ఇటీవల అత్యవసరంగా ముగిసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇంకా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాపర్టీలను విక్రయించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాలిటిక్స్ కోసమే ఆయన అమ్ముతున్నారని కొందరు అంటుండగా.. ఆస్తుల విక్రయం ఆయన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) కార్యకలాపాలకు సంబంధించి కాదని మరికొందరు చెబుతున్నారు.
విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా ఆ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో ఉన్న వివాహ సంబంధ సమస్యలు, ఆస్తి హక్కుల అంశాలు ఆ ప్రాపర్టీ విక్రయానికి కారణమయ్యాయని ఇంకొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఆ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, కోలీవుడ్ లో మాత్రం ఆ అంశం హాట్ టాపిక్ గా మారింది.
అదే సమయంలో ముఖ్య కారణంగా పార్టీ కోసం కాకపోయినా.. విజయ్ రాజకీయ ప్రణాళికలే ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ వేసే సమయంలో తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో వెల్లడించాల్సి ఉంటుంది. అందుకే ఆస్తుల విలువ తగ్గించుకోవడం లేదా వాటిని లిక్విడేట్ చేయడం ద్వారా రాజకీయంగా ఈజీగా ఉండే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. విజయ్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఇవి కేవలం ఊహాగానాలేనా? లేక నిజంగానే ఆయన తన ఆస్తులను విక్రయిస్తున్నారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా విజయ్ ఆస్తుల విక్రయం వార్తలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వ్యక్తిగత కారణాలా లేదా రాజకీయ వ్యూహమా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అదే సమయంలో పొత్తు పెట్టుకుంటారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికల్లో మాత్రం ఆయన కింగ్ మేకర్ గా నిలుస్తారని నివేదికలు చెబుతున్నాయి. అనేక సర్వేల్లో అదే విషయం కనిపిస్తుంది. దీంతో విజయ్ ఈసారి ఎలక్షన్స్ లో కింగ్ మేకర్ గా నిలుస్తారో లేదో అంతా వేచి చూడాలి.
